కంటతడి పెట్టిస్తున్న వీడియో.. ఏనుగు మృతితో వెక్కి వెక్కి ఏడ్చిన అటవీ అధికారి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి మరణిస్తే పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు. కానీ ఓ మూగ జీవి ప్రాణం పోయిందని ఓ అటవి శాఖ అధికారి వెక్కి వెక్కి ఏడ్చాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి మరణిస్తే పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు. కానీ ఓ మూగ జీవి ప్రాణం పోయిందని ఓ అటవి శాఖ అధికారి వెక్కి వెక్కి ఏడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కంటతడి పెట్టిస్తుంది.
తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంపులో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడి అటవీ శాఖ అధికారులు దానికి చికిత్స అందించారు. ఇక అదే సమయంలో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఏనుగుకు దగ్గరుండి అన్ని సేవలు చేశాడు. కానీ చివరకు ఆ ఏనుగు చికిత్స పొందుతూ మరణించింది. దీంతో దానిని అక్కడి నుంచి తీసుకెళ్ళెందుకు అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. చికిత్స సమయంలో ఏనుగు అవసరాలు తీర్చిన అటవీ శాఖ అధికారి ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. దాని తొండాన్ని ప్రేమగా కొడుతూ ఏడ్చాడు. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి.
It’s really moving to see this tearful bid adieu to an elephant by his companion forester at Sadivayal Elephant Camp in Mudumalai Tiger Reserve, Tamil Nadu. #GreenGuards #elephants VC: @karthisathees pic.twitter.com/xMQNop1YfI
— Ramesh Pandey (@rameshpandeyifs) January 20, 2021
Also Read:
అమెజాన్‌లోని పిడకలు రుచిగా లేవంటా.. అదిరిపోయే రివ్యూ ఇచ్చిన కస్టమర్.. నెట్టింట్లో పోస్ట్ వైరల్..
కస్టమర్‌కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను తీసుకొచ్చి తినేశాడు.. వీడియో వైరల్..