పెంపుడు కుక్క అనుకరించింది.. యజమానికి రూ.26 వేల బిల్లు అయ్యింది..
సాధరణంగా జంతువులలో విశ్వాసం ఉన్నది కుక్క. అయితే వీటిని చాలా మంది తమ ఇళ్ళలో ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వీటిని తమ పిల్లలుగా చూసుకుంటారు.
సాధరణంగా జంతువులలో విశ్వాసం ఉన్నది కుక్క. అయితే వీటిని చాలా మంది తమ ఇళ్ళలో ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వీటిని తమ పిల్లలుగా చూసుకుంటారు. ఇక ఆ పెంపుడు కుక్కలు కూడా యాజమానులకు ఎంతో విశ్వాసంగా.. వారి మాటలను చక్కగా అర్థం చేసుకుంటాయి. తమ యాజమాని బాధపడితే అవి బాధపడతాయి. వారు ఏడిస్తే ఓదార్చడం.. పిల్లలతో ఆడుకోవడం అన్ని పనులను చేస్తుంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమానిని అనుకరించే ప్రయత్నం చేసింది. దీంతో అతనికి రూ.26 వేల ఖర్చు అయింది.
వివరాల్లోకెళితే.. లండన్లో రస్సెల్ జోన్స్ అనే వ్యక్తి నివసిస్తుంటాడు. ఇటీవలే అతని కాలికి గాయమైంది. అందుకు చికిత్స తీసుకోవడంతో డాక్టర్లు అతనికి కాలికి కట్టు కట్టారు. ఇక అతను కర్రల సాయంతో కుంటుకుంటూ నడవాల్సి వచ్చింది. ఒకరోజు రస్సెల్ పని మీద బయటకు వెళ్తు..తన పెంపుడు కుక్క (బిల్)ను కూడా తనతోపాటే తీసుకెళ్ళాడు. తన యజమాని కుంటుతుండడంతో ఆ కుక్క కూడా కుంటడం మొదలు పెట్టింది. ఇది చూసిన రస్సెల్ కుక్క కాలికి దెబ్బ తగిలెందేమో అని కంగారు పడ్డాడు. వెంటనే పశువైద్యశాలకు తీసుకెళ్లి.. ఎక్స్రే, ఇతర పరీక్షలు చేయించాడు. ఇక ఆ పరీక్షల రిపోర్ట్లలో దానికి ఎలాంటి గాయాలు కాలేదని వచ్చింది. ఇక అప్పుడు అసలు విషయం అర్థమైంది. తను కుంటుకుంటూ నడవడంతో బిల్ కూడా తనని అనుకరించిందని. ఇక దానికి నిర్వహించిన వైద్య పరీక్షలకు 300 యూరోలు అంటే దాదాపు రూ.26 వేలు ఖర్చు అయ్యాయట. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన వీడియోను రస్సెల్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాల్ వైరల్గా మారింది. దానిని చూసిన నెటిజన్లు అ పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవుతున్నారు.
Also Read: పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..