సచిన్, ద్రావిడ్‌ల నీడలో సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయింది!

సచిన్, ద్రావిడ్‌ల నీడలో సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయింది!

ఫార్మాట్ ఏదైనా ఫస్ట్ బాల్‌ బౌండరీతో తన ఖాతాను తెరుస్తాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియాలో సెహ్వాగ్ ఆటతీరు పూర్తిగా విభిన్నం. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడాల్సిందే. అలాంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ప్రశంసలతో ముంచెత్తాడు. కాట్‌ బిహైండ్‌ అనే ఒక యూట్యూబ్‌ షోలో మాట్లాడిన లతీఫ్‌.. సెహ్వాగ్‌ ఒక విధ్వంసకర క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. భారత జట్టులో సచిన్, […]

Ravi Kiran

|

May 10, 2020 | 1:22 PM

ఫార్మాట్ ఏదైనా ఫస్ట్ బాల్‌ బౌండరీతో తన ఖాతాను తెరుస్తాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియాలో సెహ్వాగ్ ఆటతీరు పూర్తిగా విభిన్నం. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడాల్సిందే. అలాంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ప్రశంసలతో ముంచెత్తాడు. కాట్‌ బిహైండ్‌ అనే ఒక యూట్యూబ్‌ షోలో మాట్లాడిన లతీఫ్‌.. సెహ్వాగ్‌ ఒక విధ్వంసకర క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. భారత జట్టులో సచిన్, ద్రావిడ్ లాంటి లెజెండరీ క్రికెటర్లు ఉండటంతో సెహ్వాగ్ ప్రతిభ బయటికి రాలేదన్న లతీఫ్.. అతడు వేరే దేశం తరుపున ఆడి ఉంటే ఎన్నో రికార్డులను కొల్లగోట్టేవాడని అన్నాడు. పిచ్ ఏదైనా సెహ్వాగ్ ఆటతీరులో ఎటువంటి మార్పు ఉండదని.. ఎప్పుడూ దూకుడుగానే ఆడతాడని లతీఫ్ ప్రశంసలు కురిపించాడు.

భారత జట్టు తరపున ఆడటం వల్లే సెహ్వాగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందన్న లతీఫ్.. సచిన్, ద్రావిడ్‌ల నీడలో ఆడటం వల్లే సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయిందని పరోక్షంగా విమర్శించాడు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బ్యాటింగ్‌కు దిగేటప్పుడు పిచ్ ఎలా ఉంది.? బౌలర్లు ఎవరు.? అనే విషయాలను పట్టించుకోకుండా దూకుడుగా ఇన్నింగ్స్ అరంభిస్తాదన్నాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ వంటి స్టార్‌ బౌలర్లను చూసి సెహ్వాగ్ భయపడిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎంతో అద్భుతమైన ప్రతిభ ఉన్న క్రికెటర్ అయిన సెహ్వాగ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడని కొనియాడాడు. సెహ్వాగ్ మరో దేశానికీ ఆడి ఉంటే అతని క్రేజ్ వేరే రకంగా ఉండేదని లతీఫ్ తెలిపాడు.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu