వచ్చే నెలలో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు

రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చే నెలలో భారత్‌కు రానున్నాయి. వీటి రవాణా, పైలట్లకు శిక్షణ కోసం భారత వాయుసేన  ఒక బృందాన్ని ఫ్రాన్స్‌కు పంపింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాల్లో రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరవచ్చని సమాచారం.

వచ్చే నెలలో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు
Follow us

|

Updated on: Oct 15, 2020 | 10:47 PM

Rafale Fighter : రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చే నెలలో భారత్‌కు రానున్నాయి. వీటి రవాణా, పైలట్లకు శిక్షణ కోసం భారత వాయుసేన  ఒక బృందాన్ని ఫ్రాన్స్‌కు పంపింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాల్లో రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరవచ్చని సమాచారం.

ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్‌ జెట్స్‌ జూలై 29న భారత్‌కు తీసుకొచ్చారు. అయితే రాఫెల్స్ రాక‌ కోసం అంబాలా ఎయిర్‌ బేస్‌లో ‘గోల్డెన్‌ యారోస్‌’ పేరుతో కొత్త ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్‌గా వచ్చిన ఐదు రాఫెల్స్‌ను సెప్టెంబర్‌ 10న అధికారికంగా ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టారు.

తూర్పు లఢక్‌ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి పంపించారు. దీంతో లఢక్‌ గగనతలంలో విన్యాసాలు నిర్వహిస్తున్న రాఫెల్స్‌ సరిహద్దులో చైనా సైనిక కార్యకలాపాలపై కన్నేసి ఉంచాయి. ఈ తరుణంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా 2023 నాటికి ఐఏఎఫ్‌లో 36 రాఫెల్స్‌ ప్రవేశం పూర్తవుతుందని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఈ నెల 5న స్పష్టం చేశారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..