జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. తొలగిస్తున్న అధికారులు

జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. సాధారణం కంటే ఆరు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాంగ్దార్‌ సెక్టార్‌లో భారత సైనికుల శిబిరంపై మంచుకొండ విరిగిపడింది.

జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. తొలగిస్తున్న అధికారులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2020 | 9:52 PM

Kashmir snowfall : జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. సాధారణం కంటే ఆరు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాంగ్దార్‌ సెక్టార్‌లో భారత సైనికుల శిబిరంపై మంచుకొండ విరిగిపడింది. దీంతో ఓ జవాన్‌ అమరుడయ్యాడు. ఈ ప్రమాదం నుంచి మిగతా సైనికులు బయటపడ్డారు. పూంచ్‌ సెక్టార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది.

గుల్‌మార్గ్‌, బారాముల్లా , బండిపుర , కుప్వారా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. జమ్మూశ్రీనగర్‌ హైవేపై మూడు అడుగుల మేర మంచు కురిసింది. బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌తో పాటు ఆర్మీ సిబ్బంది మంచును తొలగిస్తున్నారు. భారీ యంత్రాలతో మంచును తొలగించడానికి చర్యలు చేపట్టారు అధికారులు.

కుప్వారా , బండిపుర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ జారీ చేశారు. భారీ స్థాయిలో మంచు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గందర్‌బల్‌ , బారాముల్లా ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో మంచు కురుస్తోంది.