AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alerts Customers: ఎస్‌బీఐ‌లో మీకు అకౌంట్ ఉందా?.. మీకు ఆ మెసేజ్ వచ్చిందా?.. ఈ సీరియస్ వార్నింగ్ మీకోసమే..!

SBI Alerts Customers: బ్యాంకు ఖాతాదారులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అలర్ట్ చేసింది. ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల పేరిట సైబర్..

SBI Alerts Customers: ఎస్‌బీఐ‌లో మీకు అకౌంట్ ఉందా?.. మీకు ఆ మెసేజ్ వచ్చిందా?.. ఈ సీరియస్ వార్నింగ్ మీకోసమే..!
Sbi Bank
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Apr 07, 2021 | 6:38 PM

Share

SBI Alerts Customers: బ్యాంకు ఖాతాదారులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అలర్ట్ చేసింది. ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న నయా మోసం పట్ల వార్నింగ్ ఇచ్చింది. కొత్త మోసం నేపథ్యంలో ఎస్‌బీఐలో బ్యాంకు ఖాతా కలిగిన కస్టమర్లు తమ ఖాతా వివరాలను ఇతరులెవరికీ వెల్లడించొద్దని సూచించింది. అసలేం జరిగిందంటే.. ఎస్‌బీఐ సిబ్బంది పేరిట బ్యాంకు ఖాతాదారులకు ఫోన్ చేసి వారి వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. అలాగే, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సొమ్ము వేస్తున్నామని, ఐటీ రిటర్న్స్ డబ్బు వేస్తున్నామంటూ వివరాలు సేకరిస్తున్నారు. అలా సేకరించిన వివరాల ఆధారంగా ఖాతాదారుల ఖాతాల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. ఇదే అంశంపై ఎస్‌బీఐకి కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన ఎస్‌బిఐ.. తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరిన నయా మోసం.. ఎస్‌బిఐ సిబ్బంది అంటూ సైబర్‌ నేరగాళ్లు.. వినియోగదారుల పేరుతో ఫేక్ ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను సృష్టిస్తున్నారు. అలా అసలు ఖాతాదారులకు ఫోన్ చేసి.. మీ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం జరుగుతుందని, డబ్బులు మీ ఖాతాలో వేస్తామని, వేరిఫికేషన్ కోసం ఖాతా వివరాలు చెప్పాలంటూ అకౌంట్ హోల్డర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. అలా అకౌంట్ వివరాలు తెలుసుకుని, అందులోని సొమ్ములను కాజేస్తున్నారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న పలువురు ఎస్‌బీఐ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎస్‌బీఐ అప్రమత్తమైంది. అలాగే.. తమ బ్యాంకు కస్టమర్లనూ అప్రమత్తం చేసింది. ఎస్‌బీఐలో దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారందరికీ ఎస్‌బీఐ సందేశాలు పంపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పోస్టులు పెట్టింది. ఖాతాదారులు మోసపోకుండా అవగాహన కల్పిస్తోంది. కస్టమర్లు తమ పాస్‌వర్డ్స్, ఒటిపి, సివివి కార్డ్ నంబర్, ఇతర వివరాలను ఎస్‌బీఐ అడగదని స్పష్టం చేసింది. అలాగే ఈ వివరాలను ఇతరులెవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. ఫోన్ మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఏవైనా సందేహాలుంటే నేరుగా సంబంధిత బ్రాంచ్‌ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించింది.

SBI Tweet:

ఈ విషయాలను ఎప్పటికీ మర్చిపోకండి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని అజ్ఞాత వ్యక్తులతో అస్సలు పంచుకోవద్దు. మీ బ్యాంక్ ఖాతా యొక్క పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోండి, ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఫోన్ కాల్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియని వ్యక్తి సమాచారం అడిగితే చెప్పకండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. బ్యాంక్ సమాచారం కావాల్సినట్లయితే.. ఎప్పుడూ సంబంధిత బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని సేకరించండి. ఎవరైనా మీ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించినట్లయితే.. సమీప ఎస్‌బిఐ శాఖ, పోలీసు అధికారులకు వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయండి.

Also read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

Khushbu Sundar: డీఎంకే పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిపెడుతోంది.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఖుష్బూ

COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సంచలన ఆదేశాలు