సంక్రాంతి ‘బాస్’ ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్!

2020 సంక్రాంతి బాస్‌ ఎవరు? సంక్రాతికి మా హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటే.. మా హీరో కొట్టాడని ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. మరో పక్క చిత్ర బృందాలు కూడా సక్సెస్ మీట్‌లు పెట్టి.. మాది హిట్‌ అంటే మాది హిట్ అని చెప్పుకుంటున్నారు. మరి సంక్రాంతి మొనగాడు.. మొగుడు ఎవరు? ఈ ఏడాది సంక్రాంతి సినీ పండుగ ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మొదలయ్యిందనే చెప్పాలి. పొంగల్ బరిలో సూపర్ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు మరో ముగ్గురు […]

సంక్రాంతి 'బాస్' ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్!
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 5:47 PM

2020 సంక్రాంతి బాస్‌ ఎవరు? సంక్రాతికి మా హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటే.. మా హీరో కొట్టాడని ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. మరో పక్క చిత్ర బృందాలు కూడా సక్సెస్ మీట్‌లు పెట్టి.. మాది హిట్‌ అంటే మాది హిట్ అని చెప్పుకుంటున్నారు. మరి సంక్రాంతి మొనగాడు.. మొగుడు ఎవరు?

ఈ ఏడాది సంక్రాంతి సినీ పండుగ ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మొదలయ్యిందనే చెప్పాలి. పొంగల్ బరిలో సూపర్ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు మరో ముగ్గురు హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు కూడా రేసులోకి దిగారు. అయితే ఇందులో కళ్యాణ్ రామ్ నటించిన మూవీ ‘ఎంత మంచివాడవురా’ ఇంకా రిలీజ్ కాలేదు.

 కాగా ఇప్పటికే రిలీజ్ అయిన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల్లో.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు మెయిన్ హైలైట్ అయ్యాయనే చెప్పాలి. సరిలేరు నీవెవ్వరు సినిమా ఈ నెల 11న రిలీజ్ అయ్యింది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్‌తో.. 95 కోట్ల గ్రాస్ దూసుకెళ్లింది. ఇక 12వ తేదీన అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఒక్క రోజే రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇక ఆ తరువాత రోజునే.. ఈ రెండు చిత్రబృందాలు మూవీ సక్సెస్‌ మీట్‌లు పెట్టుకున్నాయి. సంబరాలు కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాట్ హాట్‌గా కామెంట్స్ కూడా బాగానే చేశారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల హిట్ విషయంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్‌ అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. మూడో రోజుకు సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా రూ. 103 కోట్లకు చేరుకుని బాక్సాఫీస్ రికార్డు బ్రేక్ చేసింది. అటు అల్లు అర్జున్ సినిమా కూడా రెండు రోజులకి దాదాపు 100 కోట్లు దాటినట్టు ఫిల్మ్ వర్గాల టాక్.

మరి ఇంతకీ ఇప్పడు సంక్రాంతి బాస్ ఎవరు? ఇదే విషయంపై తెలుగు ఇండస్ట్రీలో ఫుల్‌గా లొల్లి నడుస్తోంది. ఇప్పటివరకూ కలెక్షన్స్ పరంగా చూస్తే మహేష్‌ బాబే ముందున్నాడు. అటు దాదాపు అల్లు అర్జున్ కూడా మహేష్‌కి దగ్గరలోనే ఉన్నాడు. మరో రెండు వారాలు గడిస్తేగాని.. బాక్సాఫీస్ లెక్క తేలదు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో