Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బూతులు తిట్టి మాపై కేసులు పెడతారా? ఇదే లాస్ట్ వార్నింగ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖ నుంచి కాకినాడ చేరుకున్న పవన్.. నేరుగా జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీని ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అలాగే కాకినాడలో దాడికి గురైన జనసేన నేతలు, కార్యకర్తలను పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై దాడి దురదృష్టకరమన్నారు. పండుగ సమయంలో ఇలాంటి సంఘటనలు […]

మీరు బూతులు తిట్టి మాపై కేసులు పెడతారా? ఇదే లాస్ట్ వార్నింగ్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2020 | 5:50 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖ నుంచి కాకినాడ చేరుకున్న పవన్.. నేరుగా జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీని ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అలాగే కాకినాడలో దాడికి గురైన జనసేన నేతలు, కార్యకర్తలను పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై దాడి దురదృష్టకరమన్నారు. పండుగ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయమన్నారు.

అలాగే.. ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి వాడిన భాష దారుణమని.. ప్రజాప్రతినిధిగా ఉండి వాడకూడని భాష ఉపయోగించారని పవన్ మండిపడ్డారు. మా ఆడపడుచులను దూషించడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహనం చేతకాని తనం కాదన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలనుకుంటే మీరెవరూ ఇక్కడ ఉండరన్నారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి భాషవాడే ప్రజాప్రతినిధిని చూడలేదని వ్యాఖ్యానించారు.

పచ్చిబూతులు తిట్టి.. దాడులు చేస్తే పోలీసులు చోద్యం చూడటం సరికాదన్నారు. పోలీసులు సుమోటోగా తీసుకొని విచారించాల్సిందని పేర్కొన్నారు. ఇంకొక్క సంఘటన మావాళ్లపై జరిగితే చేతులు కట్టుకొని కూర్చోమన్నారు.