అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ!

కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించడానికి విరాట్ కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్‌గా 41 సెంచరీలతో రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ నవంబర్ 2019 లో ఈడెన్ గార్డెన్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో సమం చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ 33 సెంచరీలతో తరువాత స్థానంలో ఉన్నాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా, భారత్‌ మూడు మ్యాచ్‌ల వన్డే […]

అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 14, 2020 | 10:50 PM

కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించడానికి విరాట్ కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్‌గా 41 సెంచరీలతో రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ నవంబర్ 2019 లో ఈడెన్ గార్డెన్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో సమం చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ 33 సెంచరీలతో తరువాత స్థానంలో ఉన్నాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా, భారత్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీకి ప్రపంచ రికార్డును కైవసం చేసుకునే అవకాశం లభిస్తుంది.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 20 టెస్ట్ సెంచరీలు సాధించగా, వన్డేల్లో 21 సెంచరీలు సాధించాడు. టెస్ట్ సెంచరీల పరంగా కోహ్లీ తన 136 పరుగులతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాంటింగ్‌ను అధిగమించాడు, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అతను వంద పరుగులు చేస్తే, అతను కెప్టెన్‌గా కూడా పాంటింగ్ రికార్డును సమం చేస్తాడు.

రికీ పాంటింగ్ 376 ఇన్నింగ్స్‌లలో 41 సెంచరీలు సాధించగా, కోహ్లీ 196 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ టెస్ట్ సగటు 54.97. కాగా, కెప్టెన్‌గా అతని సగటు 63.80. ఇక వన్డేల్లో అతని కెరీర్ సగటు 59.84 కాగా, కెప్టెన్‌గా 77.60.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగే తొలి వన్డేలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది, రెండో మ్యాచ్ జనవరి 17 న రాజ్‌కోట్‌లో, సిరీస్ చివరి మ్యాచ్ జనవరి 19 న బెంగళూరులో జరగనుంది.