టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే
ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 255 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఆరంభంనుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్ వేసిన 5వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(10) పెవిలియన్ చేరాడు. అయితే ధావన్, రాహుల్ జోడీ రెండో వికెట్‌కి 121 పరుగులు జోడించారు. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. కాగా.. 28వ ఓవర్‌లో వీరి […]
ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 255 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఆరంభంనుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్ వేసిన 5వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(10) పెవిలియన్ చేరాడు.
అయితే ధావన్, రాహుల్ జోడీ రెండో వికెట్‌కి 121 పరుగులు జోడించారు. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. కాగా.. 28వ ఓవర్‌లో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ ఓవర్ తొలి బంతికి రాహుల్(47) పెవిలియన్ చేరారు. ధావన్(74) ఔట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(16) జంపా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 255 పరుగులకే ఆలౌట్ అయింది.