వికెట్ కోల్పోకుండా.. ఆసీస్ అద్భుత విజయం!

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను 255 పరుగులకు కట్టడి చేసింది.  తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (110 పరుగులు 114 బంతుల్లో), డేవిడ్‌ వార్నర్‌లు (128 పరుగులు 112 బంతుల్లో) అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లకు ధీటుగా సమాధానం ఇస్తూ.. శతకాలు సాధించారు. దీంతో ఒక వికెట్ కూడా నష్టపోకుండా ఆస్ట్రేలియా […]

వికెట్ కోల్పోకుండా.. ఆసీస్ అద్భుత విజయం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 14, 2020 | 10:52 PM

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను 255 పరుగులకు కట్టడి చేసింది.  తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (110 పరుగులు 114 బంతుల్లో), డేవిడ్‌ వార్నర్‌లు (128 పరుగులు 112 బంతుల్లో) అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లకు ధీటుగా సమాధానం ఇస్తూ.. శతకాలు సాధించారు. దీంతో ఒక వికెట్ కూడా నష్టపోకుండా ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కు ఆరంభంనుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్ వేసిన 5వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(10) పెవిలియన్ చేరాడు. అయితే ధావన్, రాహుల్‌ జోడీ రెండో వికెట్‌కి 121 పరుగులు జోడించారు. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. కాగా.. 28వ ఓవర్‌లో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ ఓవర్ తొలి బంతికి రాహుల్(47) పెవిలియన్ చేరారు. ధావన్(74) ఔట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(16) జంపా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 255 పరుగులకే  ఆలౌట్ అయింది.