చంద్రయాన్‌ ప్రయోగాల్లో పంపిస్తున్న ఆ శ్లోకాలు ఏంటి..?

చంద్రయాన్ 1 తోనే ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగంతో ఆ రికర్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగాల్లో చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్‌తో పాటు ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా చంద్రుడిపైకి పంపించారు. ఇంతకీ చంద్రయాన్1 తో జాబిల్లికి చేరిన ఆ శ్లోకంలో ఏముంది..? ఇప్పుడు చంద్రయాన్2తో ఏ శ్లోకం పంపిస్తున్నారు..? ఆ శ్లోకాలేంటో తెలుసుకుందాం. అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తూ ప్రపంచ […]

చంద్రయాన్‌ ప్రయోగాల్లో పంపిస్తున్న ఆ శ్లోకాలు ఏంటి..?
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2019 | 6:18 AM

చంద్రయాన్ 1 తోనే ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగంతో ఆ రికర్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగాల్లో చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్‌తో పాటు ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా చంద్రుడిపైకి పంపించారు. ఇంతకీ చంద్రయాన్1 తో జాబిల్లికి చేరిన ఆ శ్లోకంలో ఏముంది..? ఇప్పుడు చంద్రయాన్2తో ఏ శ్లోకం పంపిస్తున్నారు..? ఆ శ్లోకాలేంటో తెలుసుకుందాం.

అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఇస్రో. ముఖ్యంగా చంద్రుడిపై పరిశోధనలకు ఇస్రో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే చంద్రయాన్1తో కీలక సమాచారం రాబట్టింది. ఇప్పుడు చంద్రయాన్2తో మరో కీలక అడుగు వేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే చంద్రయాన్1 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకర్షిస్తోంది. చంద్రయాన్1 ప్రయోగం సమయంలో మూన్ ఇంపాక్ట్ రోబోపై ఓ సంస్కృత శ్లోకాన్ని రాశారు. అదేంటంటే.. “ఓ చంద్రుడా మా తెలివి తేటలతో నీ వద్దకు చేరుకున్నాం.. ఇకపై ఏం చేయాలో మార్గం నిర్దేశించూ.. “అని ఆ సంస్కృత శ్లోకాన్నిరాసి పంపారు. ఆ శ్లోకం రుగ్వేదానికి సంబంధించినదని తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన విషయం.. ఇప్పటికీ ఇస్రో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. చంద్రయాన్1 శాటిలైట్‌లో సంస్కృత శ్లోకం రాయడంతో పాటు త్రివర్ణ పతాక ముద్రను పొందుపరిచారు. పొలార్ శాటిలైట్‌ లాంచ్ వెహికల్.. నుంచి మూన్ ఇంపాక్ట్ రోబోను చంద్రుడిపై జార విడిచినప్పుడు అది చంద్రుడిని చేరి అక్కడి చిత్రాలను భూమికి పంపింది. మొత్తానికి మన శాస్త్రవేత్తలు పంపిచంని శ్లోకంతో.. చంద్రయాన్1లో మార్గం నిర్దేశించమని ఆ జాబిల్లిని అడిగితే.. చంద్రయాన్2కి మార్గం చూపించింది.

అయితే ఈసారి చంద్రయాన్2 ప్రయోగం సందర్భంగా జాబిల్లిపైకి పంపే రాకెట్‌పై ఏం రాశారనేది తెలియాల్సి ఉంది. కాగా, వేద పండితులు కూడా సైన్స్‌కు వేదాలకు సంబంధం ఉందని చెబుతున్నారు. వేదాలే శాస్త్ర సాంకేతికాభివృద్ధికి మూలమని అంటున్నారు. మన వేదాల ఆధారంగానే చాలా దేశాలు సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తున్నాయని వారు చెబుతున్నారు. మొత్తానికి మన శాస్త్రవేత్తలు చంద్రయాన్2 ప్రయోగంలో భాగంగా రాకెట్‌పై ఏం శ్లోకం రాశారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..