బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. 107 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి
దేశంలో కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గోవాది ఓ కొలిక్కి వచ్చినా.. ఇంకా కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాలపై ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో రాష్ట్రానికి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ముకుల్ రాయ్ అన్నారు. ముకుల్ రాయ్ 2017లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. పార్టీ మారే […]
దేశంలో కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గోవాది ఓ కొలిక్కి వచ్చినా.. ఇంకా కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాలపై ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో రాష్ట్రానికి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ముకుల్ రాయ్ అన్నారు. ముకుల్ రాయ్ 2017లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. పార్టీ మారే వారిలో అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో పాటు.. కాంగ్రెస్, సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని వివరించారు. పార్టీలో చేరే వారి జాబితాను తయారు చేశామని, వాళ్లంతా తమతో టచ్‌లోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా,బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం సభ్యుల సంఖ్య 294. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి అత్యధికంగా 211 సీట్లు రాగా, బీజేపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. కాంగ్రెస్ 44సీట్లు సొంతం చేసుకోగా..వామపక్షాలు 32స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.