బీజేపీని ఇరుకున పెట్టేలా స్వామి వ్యాఖ్యలు
సొంతపార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే బీజేపీ ఒక్కటే ఉంటే చాలదని, అలా ఉంటడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఇటలీ వారినీ, వారి సంతానాన్ని పక్కనబెట్టి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పార్టీని, శరద్ పవార్ తన ఎన్సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సూచించారు. దీనివల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని తద్వారా ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందనే అభిప్రాయాన్ని స్వామి వ్యక్తం […]
సొంతపార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే బీజేపీ ఒక్కటే ఉంటే చాలదని, అలా ఉంటడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఇటలీ వారినీ, వారి సంతానాన్ని పక్కనబెట్టి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పార్టీని, శరద్ పవార్ తన ఎన్సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సూచించారు. దీనివల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని తద్వారా ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందనే అభిప్రాయాన్ని స్వామి వ్యక్తం చేశారు.