‘నాకు డ్రగ్స్ తో సంబంధంలేదు.’. కన్నీరు పెట్టుకున్న యాంకర్ అనుశ్రీ

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. ఏపాపం తెలియని తనపై లేనిపోని ఊహాగానాలు వస్తున్నాయంటూ కంటనీరు పెట్టుకుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మరోసారి స్పష్టం చేసింది. సీసీబీ అధికారులు తనను విచారించినంత మాత్రాన తాను నేరస్థురాలిని కాదంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేసిన అనుశ్రీ తన వ్యధను వినిపించే ప్రయత్నం చేసింది. తనకు తెలిసిన వివరాలను అధికారులకు చెప్పానని, తాను ఏ తప్పు చేయలేదని […]

  • Venkata Narayana
  • Publish Date - 12:37 pm, Sat, 3 October 20
'నాకు డ్రగ్స్ తో సంబంధంలేదు.'. కన్నీరు పెట్టుకున్న యాంకర్ అనుశ్రీ

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. ఏపాపం తెలియని తనపై లేనిపోని ఊహాగానాలు వస్తున్నాయంటూ కంటనీరు పెట్టుకుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మరోసారి స్పష్టం చేసింది. సీసీబీ అధికారులు తనను విచారించినంత మాత్రాన తాను నేరస్థురాలిని కాదంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేసిన అనుశ్రీ తన వ్యధను వినిపించే ప్రయత్నం చేసింది. తనకు తెలిసిన వివరాలను అధికారులకు చెప్పానని, తాను ఏ తప్పు చేయలేదని చేతులు జోడించి చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక చిత్రసీమకు చెందిన మహిళా నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో చాటింగ్ చేసినట్టు సీసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కొనుగోలు చేసిన మాదకద్రవ్యాలతో బెంగళూరు శివారులోని ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకున్నట్టు సాక్ష్యాధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

 

View this post on Instagram

 

ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ನನಗೆ ಶಕ್ತಿ

A post shared by ಅನುಶ್ರೀ Anchor Anushree (@anchor_anushreeofficial) on