మహిళలు వైన్ లాంటివారంటూ.. మరోసారి సత్తా చాటిన అక్కినేని కోడలు..

టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది సమంత. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి జరిగిందంటే.. కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టే. కానీ నాగ చైతన్యతో పెళ్లైన తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ..

 • Tv9 Telugu
 • Publish Date - 8:24 pm, Tue, 17 March 20
మహిళలు వైన్ లాంటివారంటూ.. మరోసారి సత్తా చాటిన అక్కినేని కోడలు..

టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది సమంత. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి జరిగిందంటే.. కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టే. కానీ నాగ చైతన్యతో పెళ్లైన తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ.. కెరీర్‌లో జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోతుంది. అంతేకాదు యంగ్ బ్యూటీలైన.. పూజా, రష్మికలు ఎంట్రీ ఇచ్చినా కూడా.. సమంత క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. తాజాగా ఓ పత్రిక నిర్వహిస్తున్న మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ 2019 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది సామ్. ఆయా రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు మహిళలపై ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా సమంతకు మొదటిస్థానం దక్కింది.

ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నిజానికి 30 ఏళ్ల తర్వాతనే మహిళలు అందంగా కనిపిస్తారని పేర్కొంది. అలాగే మహిళలు వైన్ లాంటి వారంది. కాగా.. 30 ఏళ్ల తరువాత మహిళలు ఎలా ఉంటారోనని భయపడొద్దు. ఎందుకంటే.. వయసు పెరిగే కొలదీ.. వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. దాంతో.. తమను తాము ఎంతో అందంగా చూపించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. కాగా.. సమంతతో పాటు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ 2019 లిస్ట్‌లో మరికొందరు స్థానం సంపాదించుకున్నారు. మరి వారెవరో.. మీరూ ఓ లుక్కేయండి.

 • మొదటి స్థానంలో సమంత అక్కినేని
 •  రెండొవ స్థానంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో గెలిచిన సంజన వీజీ
 • మూడొవ స్థానంలో పీవీ సింధు
 • నాల్గవ స్థానంలో అదితి రావు హైదరి
 • ఐదవ స్థానంలో పూజా హెగ్డే
 • ఏడవ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్
 • ఎనిమిదవ స్థానంలో కాజల్ అగర్వాల్
 • తొమ్మిదో స్థానంలో రష్మిక మందన్న
 • 11వ స్థానంలో నిధి అగర్వాల్
 • 12వ స్థానంలో కియారా అద్వానీ
 • 14వ స్థానంలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్
 • 15వ స్థానంలో రాశీఖన్నా
 • 16వ స్థానంలో ఈషా రెబ్బా
 • 17వ స్థానంలో పాయల్ రాజ్‌పుత్
 • 20వ స్థానంలో కీర్తి సురేష్
 • 21వ ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్
 • 22వ ప్లేస్‌లో తమన్నా
 • 23వ స్థానంలో సాయి పల్లవి
 • 24వ స్థానంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
 • 25వ స్థానంలో యాంకర్ శ్రీముఖి
 • 26వ స్థానంలో ఆదా శర్మ
 • 28వ స్థానంలో రెజీనా
 • 29వ స్థానంలో మాజీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి