కిచ్చా సుదీప్‌కు కండల వీరుడి సర్‌ప్రైజ్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..మంచి, చెడుతో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఇక తన సహనటులకి అప్పుడప్పుడు క్రేజీ గిప్ట్స్ ఇస్తూ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. రీసెంట్‌గా ‘దబాంగ్‌ 3’ తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు సల్లూ భాయ్. ప్రస్తుతం ఆ సక్సెస్‌లోనే మునిగితేలుతున్నాడు. ఈ మూవీలో విలన్‌గా కిచ్చా సుదీప్ నటించాడు. మూవీ షూటింగ్ టైంలో సల్మాన్, సుదీప్ మంచి ప్రెండ్సయ్యారు. ఈ నేపథ్యంలో సుదీప్‌కు […]

కిచ్చా సుదీప్‌కు కండల వీరుడి సర్‌ప్రైజ్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2020 | 2:06 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..మంచి, చెడుతో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఇక తన సహనటులకి అప్పుడప్పుడు క్రేజీ గిప్ట్స్ ఇస్తూ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. రీసెంట్‌గా ‘దబాంగ్‌ 3’ తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు సల్లూ భాయ్. ప్రస్తుతం ఆ సక్సెస్‌లోనే మునిగితేలుతున్నాడు. ఈ మూవీలో విలన్‌గా కిచ్చా సుదీప్ నటించాడు. మూవీ షూటింగ్ టైంలో సల్మాన్, సుదీప్ మంచి ప్రెండ్సయ్యారు. ఈ నేపథ్యంలో సుదీప్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ అగ్రకథానాయకుడు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 కారును గిప్ట్‌గా ఇచ్చి మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు తనకు ఇష్టమైన కుక్క ఫోటోను ఓ జాకెట్‌ డిజైన్ చేయించి కానుకగా ఇచ్చాడు.  ఆ ఆనందకరమైన మూమెంట్స్‌ని సుదీప్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు  ‘దబాంగ్‌ 3’  రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించింది.