రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వామ్మో ! ‘ కేక ‘ పుట్టించే ఎంత భారీ కేక్ ?

ఆలిండియా కన్నడ రాకింగ్ స్టార్ యష్ 34 ఏళ్ళ వాడయ్యాడు. ఈ సందర్భంగా అతని బర్త్ డే ని పురస్కరించుకుని ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా  కాదు.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు.. అంటే తెల్లవారితే బుధవారం అడుగుపెట్టిన క్షణంలో బెంగుళూరు నయనదహళ్లి లోని నందిలింక్ గ్రౌండ్స్ వేలాది ఫాన్స్ తో నిండిపోయింది. ఈ యువహీరో జన్మ దినం సందర్భంగా ఎవరూ, ఎన్నడూ చేయనివిధంగా 5 వేల కేజీల బరువు, 216 అడుగుల పొడవైన భారీ […]

రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వామ్మో ! ' కేక ' పుట్టించే ఎంత భారీ కేక్ ?
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 08, 2020 | 3:41 PM

ఆలిండియా కన్నడ రాకింగ్ స్టార్ యష్ 34 ఏళ్ళ వాడయ్యాడు. ఈ సందర్భంగా అతని బర్త్ డే ని పురస్కరించుకుని ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా  కాదు.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు.. అంటే తెల్లవారితే బుధవారం అడుగుపెట్టిన క్షణంలో బెంగుళూరు నయనదహళ్లి లోని నందిలింక్ గ్రౌండ్స్ వేలాది ఫాన్స్ తో నిండిపోయింది. ఈ యువహీరో జన్మ దినం సందర్భంగా ఎవరూ, ఎన్నడూ చేయనివిధంగా 5 వేల కేజీల బరువు, 216 అడుగుల పొడవైన భారీ కేక్ ను ఆయన కట్ చేశాడు. అంతే.. అభిమానుల ఆనందోత్సాహాలు, కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. అభిమానులు అనేక బస్సుల్లో తరలిరాగా.. వారిని లొకేషన్ కి చేర్చేందుకు ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ నుంచి కూడా వివిధ వాహనాలను సమకూర్చారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ హీరోకు 20 వేల మందికి పైగా అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరైనట్టు సమాచారం. తన భార్య రాధికా పండిట్ తో కలిసి యష్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.