‘బుట్టబొమ్మ’ సింగర్‌పై సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్
అల వైకుంఠపురములో చిత్రంలో 'బుట్టబొమ్మ' అనే సాంగ్‌తో పాపులర్ అయిన అర్మాన్ మాలిక్ సోదరుడు అమల్ మాలిక్‌ను సల్మాన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అంతే ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా కుమ్మేస్తున్నారు. అమల్ మాలిక్ చేసిన తప్పేంటో తెలుసా..
ఫ్యాన్స్ మధ్య గొడవలు టాలీవుడ్‌లోనే కాదు.. ఈ మధ్య బాలీవుడ్‌లోనూ పెరిగిపోయాయి. తమ నచ్చనివారిపై నెట్టింట్లో దాడి చేస్తున్నారు. కామెంట్స్ పెడుతూ చిర్రెత్తిస్తున్నారు. అంతేకాదు ఒకరి ఫ్యాన్స్‌పై మరొకరు మాటల తూటాలను వదులుతున్నారు.
అల వైకుంఠపురములో చిత్రంలో ‘బుట్టబొమ్మ’ అనే సాంగ్‌తో పాపులర్ అయిన అర్మాన్ మాలిక్ సోదరుడు అమల్ మాలిక్‌ను సల్మాన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అంతే ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా కుమ్మేస్తున్నారు. అమల్ మాలిక్ చేసిన తప్పేంటో తెలుసా.. కేవలం తాను ఓ హీరోకు ఫాన్ అంటూ ప్రకటించడమే. అందుకు కారణం ఆయన సల్మాన్ అభిమానితో.. షారూఖ్ అభిమానిని అని చెప్పడం.
దీంతో సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్కు చేరింది. ఈ చిన్న విషయాన్ని రచ్చ చేస్తున్నారు. అమల్ ..షారూఖ్ ఖాన్ తన అభిమాన నటుడు అని చెప్పడంతో సల్మాన్ అభిమానులు ట్విట్టర్ లో వార్ నడిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం `జై హో`తో సల్మాన్ కి సన్నిహితుడైన అమల్ ఇలా మాట్లాడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అమల్‌పై ట్విట్టర్ వార్ ఇప్పుడు బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.