Saffron Cultivation: ప్రయోగం సక్సెస్.. విరగబూసిన కశ్మీర్‌ గులాబ్.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 07, 2021 | 2:06 PM

భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా కుంకుమ సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదట హిమాచల్ ప్రదేశ్‌లో.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో..

Saffron Cultivation: ప్రయోగం సక్సెస్.. విరగబూసిన కశ్మీర్‌ గులాబ్.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో..
Saffron

Follow us on

దక్షిణ కాశ్మీర్ లోని పాంపోర్ పట్టణంలో… కుంకుమ పూల సాగు ఎక్కువగా జరుగుతుంది. మనకు తెలుసు… సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. జస్ట్ 1 గ్రాము కుంకుమపూల ధర రూ.400 ఉందంటే… అది ఎంత విలువైనదో మనం గ్రహించవచ్చు. ఏటా ఈ సమయానికి పాంపోర్ లో రైతులు… కుంకుమ పూలను తెంపుతూ… చాలా బిజీగా ఉండేవారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా కుంకుమ సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదట హిమాచల్ ప్రదేశ్‌లో.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వు సాగు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని ప్రతి బ్లాక్‌లో దీని సాగు ప్రారంభం కానుంది. జిల్లాలోని కొన్ని బ్లాక్‌లలో ఇది మొదటి ప్రయోగంగా ప్రారంభించబడింది.

గత సంవత్సరం మూడు బ్లాకుల్లో..

కుంకుమ పెంపకం 2020 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలోని మూడు బ్లాక్‌లలో ప్రారంభమైంది. గోవింద్ బల్లభ్ పంత్, హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ శాస్త్రవేత్తల గ్రీన్ సిగ్నల్ తరువాత బల్బులు అంటే విత్తనాలు నాటబడ్డాయి. దీని కోసం 3 క్వింటాళ్ల కుంకుమ గింజలను కాశ్మీర్ నుండి ఆర్డర్ చేసి షీట్లఖేట్‌లో 5 , రానిఖేట్‌లో 2 సాగుదారులకు ఇచ్చారు. ఈ ప్రయోగం ఫలించింది. దీని దృష్ట్యా ఇప్పుడు జిల్లాలోని ప్రతి బ్లాక్‌లో కుంకుమ పెంపకాన్ని ప్రారంభించడానికి ఒక కసరత్తు జరుగుతోంది.

ఐదు క్వింటాళ్ల కుంకుమ పువ్వు..

జిల్లాలో కుంకుమ వాణిజ్య సాగును ప్రోత్సహించడానికి జిల్లా ఉద్యాన శాఖ కాశ్మీర్ నుండి ఐదు క్వింటాళ్ల కుంకుమ బల్బులను పొందుతోంది. నాలుగు బ్లాక్‌లలో కుంకుమ సాగుకు సంబంధించి మేము చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని డిపార్ట్‌మెంటల్ అధికారులు తెలిపారు. ఇప్పుడు మొత్తం జిల్లాలో రైతులు దీని కోసం ప్రేరేపించబడుతున్నారు.

జమ్ము కశ్మీర్‌లో అత్యధిక ఉత్పత్తి..

రెడ్ సోనాగా ప్రసిద్ధి చెందిన కుంకుమ పెంపకం మేలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ నాటికి పంట సిద్ధంగా ఉంటుంది. ఇది భారతదేశంలో దాదాపు 5,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. 160,000 పువ్వుల నుండి దాదాపు ఒక కిలో కుంకుమ పువ్వు వస్తుంది. జమ్ము కశ్మీర్‌లో కుంకుమపువ్వు ఎక్కువగా పండిస్తారు. రాష్ట్రంలో దాదాపు 3,700 హెక్టార్ల విస్తీర్ణంలో కుంకుమపువ్వు సాగు చేయబడుతోంది. దాదాపు 32,000 మంది రైతులు దానితో సంబంధం కలిగి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ దేశంలో కుంకుమపువ్వు పండించే రెండవ రాష్ట్రం.

ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu