AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: ప్రభాస్ వాచ్ ధర వింటే షాక్..!

రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిన ఈ పేరు.. ఇప్పుడు మరోసారి ‘సాహో’తో పీక్ స్థాయికి చేరిపోయింది. ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ  చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో డార్లింగ్ ప్రభాస్ అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇవ్వగా.. ఈవెంట్‌కు వచ్చిన చాలామంది కళ్ళు ప్రభాస్ […]

Saaho: ప్రభాస్ వాచ్ ధర వింటే షాక్..!
Ravi Kiran
|

Updated on: Aug 19, 2019 | 4:26 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిన ఈ పేరు.. ఇప్పుడు మరోసారి ‘సాహో’తో పీక్ స్థాయికి చేరిపోయింది. ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ  చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో డార్లింగ్ ప్రభాస్ అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇవ్వగా.. ఈవెంట్‌కు వచ్చిన చాలామంది కళ్ళు ప్రభాస్ చేతికి ఉన్న ‘వాచ్’పై పడ్డాయి. ఇక ఫ్యాన్స్ ఆ వాచ్ ధర గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగా.. ఒక్కసారిగా అందరి కళ్ళు తిరిగినంత పనైంది.

ఆ వాచ్ బ్రాండ్ పేరు ‘హబ్లట్’ కాగా.. ఎక్కువగా హాలీవుడ్ నటులు ఇలాంటి వాచ్‌లను వాడుతుంటారు. ఇక దీని ధర సుమారు 15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్.. డార్లింగ్‌కు ఆ వాచ్ భలే ఉందంటూ సోషల్ మీడియాలో షేర్స్ చేసి తెగ సంబరపడిపోతున్నారు.