‘సాహో’ సెన్సార్ రివ్యూ.. బొమ్మ హిట్టు గురూ!

'సాహో' సెన్సార్ రివ్యూ.. బొమ్మ హిట్టు గురూ!

‘బాహుబలి’ సినిమా తర్వాత హీరో ప్రభాస్‌.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఊపుతో.. సుజీత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమాతో వస్తున్నాడు. దాదాపు 300 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. […]

Ravi Kiran

|

Aug 22, 2019 | 4:37 PM

‘బాహుబలి’ సినిమా తర్వాత హీరో ప్రభాస్‌.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఊపుతో.. సుజీత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమాతో వస్తున్నాడు. దాదాపు 300 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ‘డార్లింగ్’ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు ఉన్నట్టు సమాచారం. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు చూడని యాక్షన్ సీన్స్‌ను ‘సాహో’లో చూడవచ్చని.. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ వాళ్ళు కితాబు ఇచ్చారు. పూర్తిగా హాలీవుడ్ రేంజ్ సినిమాను తెరకెక్కించారని చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu