ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయలేడుః సెహ్వాగ్

ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయలేడుః సెహ్వాగ్

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలిగిపోతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు పొందుతున్న కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీల మీద కూడా టార్గెట్ పెట్టుకుని.. వేట మొదలుపెట్టాడు. కోహ్లీ ప్రస్తుతం 68 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేశాడు. సో ఆ రికార్డు కూడా పెద్ద కష్టమేమి కాదు. ఇది ఇలా ఉంటే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర […]

Ravi Kiran

|

Aug 22, 2019 | 5:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలిగిపోతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు పొందుతున్న కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీల మీద కూడా టార్గెట్ పెట్టుకుని.. వేట మొదలుపెట్టాడు. కోహ్లీ ప్రస్తుతం 68 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేశాడు. సో ఆ రికార్డు కూడా పెద్ద కష్టమేమి కాదు. ఇది ఇలా ఉంటే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. కోహ్లీ ఎన్ని రికార్డులను నెలకొల్పినా.. సచిన్ సాధించిన ఓ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేదని పేర్కొన్నాడు. దీనిపై కోహ్లీకి సవాల్ కూడా విసిరాడు.

సచిన్ టెండూల్కర్ పేరిట 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉంది. ఈతరం క్రికెటర్లు అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఖచ్చితంగా ఆడలేరు. ఈ శకంలో మేటి ఆటగాడైన విరాట్ కోహ్లీ కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. కాగా కోహ్లీ ఇప‍్పటివరకూ 77 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu