AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు… నేటి నుంచి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ లో ఉదయం పదిన్నరకు కొందరు ఉద్యోగులకు నియామపక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హాజరయ్యే సుమారు 5వేల మంది ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు.  వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కీలకంగా నిర్దేశించిన […]

వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు లైట్ తీసుకుంటే వేటు పడుద్ది! ఈ రూల్స్ తెలుసా మీకు?
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2019 | 11:19 AM

Share

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అమలులోకి తెచ్చేందుకు భావిస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు… నేటి నుంచి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ లో ఉదయం పదిన్నరకు కొందరు ఉద్యోగులకు నియామపక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హాజరయ్యే సుమారు 5వేల మంది ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు.

 వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కీలకంగా నిర్దేశించిన కొన్ని నియమాలు, నిబంధనలు:

  1. నియామకపత్రాలు అందుకున్నవారు 30 రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగిస్తారు
  2. విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాలల నుంచి బాడీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారు బయటకు వచ్చేసినట్లుగా ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం సమర్పించాలి
  4. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఉద్యోగం నుంచి తొలగించి.. చట్టప్రకారం చర్యలు
  5. రూ.15 వేల వేతనం చెల్లిస్తామన్న ప్రభుత్వం.. రెండేళ్ల ట్రైనింగ్ పిరియడ్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం తమకు ఉందని స్పష్టంచేసింది.
  6. రెండేళ్లలో నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనబరిస్తే రెగ్యులర్‌ సర్వీసులోకి శాశ్వత స్కేలులో తీసుకుంటామని, లేదంటే తొలగిస్తామని తెలిపింది.
  7. మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకూ అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలు వెనక్కి ఇచ్చేయాలని వెల్లడించింది.
  8. నిబంధనలు, పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం తెలిపింది.

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!