రోడ్డు ప్రమాదంలో టీవీ9 కెమెరామన్ మృతి.. పలువురు దిగ్భ్రాంతి

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్ దగ్గర టీవీ9 సీనియర్ కెమెరామన్ మురళీ ప్రసాద్ రోడ్డు క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో మురళీ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తలకు తీవ్ర గాయం కావడంతో.. రక్తస్రావం జరిగి మ‌‌ృతిచెందాడు. మురళీ ప్రసాద్ మృతితో ఆయన కుటుంబీలకు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతిపట్ల టీవీ9 యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం […]

రోడ్డు ప్రమాదంలో టీవీ9 కెమెరామన్ మృతి.. పలువురు దిగ్భ్రాంతి
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 11:55 AM

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్ దగ్గర టీవీ9 సీనియర్ కెమెరామన్ మురళీ ప్రసాద్ రోడ్డు క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో మురళీ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తలకు తీవ్ర గాయం కావడంతో.. రక్తస్రావం జరిగి మ‌‌ృతిచెందాడు. మురళీ ప్రసాద్ మృతితో ఆయన కుటుంబీలకు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతిపట్ల టీవీ9 యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత పదేళ్లుగా టీవీ9 సంస్థలో సీనియర్ కెమెరామన్‌గా పనిచేస్తున్నాడు మురళీ ప్రసాద్.

మురళీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎంఓ అధికారులు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉన్న టీవీ9 కెమెరామన్ మురళీ మృత దేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. మురళీ ప్రసాద్ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి దేవేనేని ఉమా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మురళీ మృతి కుటుంబ సభ్యులతో పాటు జర్నలిస్టులకు కూడా తీరని లోటు అన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభూతి తెలిపారు. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, తురగా నాగభూషణం మురళీప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.