Royal Enfield Classic Battle Green: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త కలర్ లో బైక్.. సూపర్బ్ .. ధర, ఫీచర్స్ తెలుసా..?

యూత్ కు మార్కెట్ లోకి కొత్త బండి వచ్చిందంటే చాలు ఓ క్రేజ్.. ఆ బైక్ ఏమిటి.. ఎలా పనిచేస్తోంది.. ఎలాంటి కలర్ అనే విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు... రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త కలర్ మోడల్‌ను తాజగా...

Royal Enfield Classic Battle Green: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త కలర్ లో బైక్.. సూపర్బ్ .. ధర, ఫీచర్స్ తెలుసా..?
Follow us

|

Updated on: Feb 02, 2021 | 11:28 AM

Royal Enfield Classic Battle Green: యూత్ కు మార్కెట్ లోకి కొత్త బండి వచ్చిందంటే చాలు ఓ క్రేజ్.. ఆ బైక్ ఏమిటి.. ఎలా పనిచేస్తోంది.. ఎలాంటి కలర్ అనే విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాసరే మార్కెట్ లోని కొత్త బైక్ వచ్చిందటే చాలు తమ ఇంట్లో ఉండాలని అని కోరుకునే సెలబ్రెటీలు కూడా మనకు తెలుసు. ఒకప్పుడు బైక్ ను మగవారు మాత్రమే ఎక్కువుగా నడిపేవారు.. అయితే మేము మాత్రం తక్కువా అంటూ ఆడవాళ్లు కూడా బైక్ మీద రయ్ రయ్ అంటూ సవారీ చేస్తున్నారు.

ఇక మన దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన క్లాసిక్ 350, బుల్లెట్ వాహనాలను ఇప్పటికే చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. అయితే బుల్లెట్‌కు గాను రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త కలర్ మోడల్‌ను తాజగా విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫారెస్ట్ గ్రీన్ కలర్ మోడల్‌ను తాజాగా విడుదల చేశారు. దీని ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.1,33,000 లక్షలు ఉంది.

అయితే ఈ కొత్త కలర్ మోడల్ కేవలం స్టాండర్డ్ వేరియెంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియెంట్‌లో రెడ్‌, బ్లూ, బ్లాక్ కలర్ మోడల్స్ లభిస్తున్నాయి. స్టాండర్డ్ వేరియెంట్లలో ఇప్పటికే బ్లాక్‌, ఆనిక్స్ బ్లాక్‌, బుల్లెట్ సిల్వర్ కలర్ మోడల్స్‌ను విక్రయిస్తుండగా, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఈ జాబితాలో తాజాగా చేరింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ వేరియెంట్‌లో ఉన్న అన్ని సదుపాయాలను ఫారెస్ట్ గ్రీన్ కలర్ వేరియెంట్‌లో అందిస్తున్నారు. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే ఇది బీఎస్‌-6 వెర్షన్‌లో లభిస్తుంది. ఇక ఇందులో 346 సిసి సింగిల్ సిలిండర్‌, ఎయిర్ కూల్ ఇంజిన్‌, 19.1 బేసిక్ హార్స్ పవర్‌, 5 స్పీడ్ గేర్ బాక్స్‌, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌, 280ఎంఎం ఫ్రంట్ డిస్క్‌, 153 ఎంఎం రియర్ డ్రమ్‌, సింగిల్ చానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ 19 ఇంచుల టైర్లను ముందు వెనుక భాగాల్లో కలిగి ఉంది. 186 కిలోల బరువును కలిగి ఉంటుంది. 13.5 లీటర్ల కెపాసిటీ ఉన్న ఇంధన ట్యాంక్ ఉంది. యూత్ కు నచ్చే క్రేజీ కలర్ తో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది

Also Read: మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!