AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు అచ్చెన్నాయుడపై ఆరోపణలున్నాయి.

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2021 | 12:15 PM

Share

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు అచ్చెన్నాయుడపై ఆరోపణలున్నాయి. దీంతో  ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక నేడు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లనున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు.

అసలు ఏం జరిగిందంటే…

నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Feb 2021 12:13 PM (IST)

    అచ్చెన్న అరెస్ట్ దుర్మార్గం : సోమిరెడ్డి

    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈ రోజు మళ్లీ అరెస్ట్ చేయడం దుర్మార్గమని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ విషయంలో తన తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని..కుదరకపోతే నీ ఇష్టం అని వదిలేశారని చెప్పారు.

  • 02 Feb 2021 11:37 AM (IST)

    రౌడీలను అరెస్టు చేయకుండా.. రాజమర్యాదలు చేస్తున్నారు : పట్టాభి

    వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి మారణాయుధాలతో రండి.. దాడులు చేద్దాం అని నడి రోడ్డుపై వీరంగం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారని  టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఇలాంటి అరాచకాలను ప్రశ్నించిన అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తారా? అని ఫైరయ్యారు.  రౌడీలను అరెస్టు చేయకుండా.. వారికి రాజమర్యాదలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 02 Feb 2021 11:27 AM (IST)

    అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై నక్కా ఆనంద బాబు సీరియస్

    అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద బాబు ఖండించారు. జగన్ దర్మార్గపు పాలనకు ఇదే నిదర్శనమన్నారు. తెలుగుదేశం పేరు వింటేనే జగన్‌కు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. అక్రమ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు విమర్శించారు.

  • 02 Feb 2021 11:04 AM (IST)

    ఓటమి భయంతోనే అరెస్టులు: బోండా ఉమా

    పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం తోనే టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత  బోండా ఉమా విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని.. టీడీపీ నాయకులు బయట ఉంటే వైసీపీ ఆటలు సాగవని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. నిమ్మాడలో వైసీపీ గుండాలు కత్తులు, ఆయుధాలతో బహిరంగంగా తిరిగినా పోలీసులు వారిపై కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసి పోటీ చేసే అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడమే వైసీపీ వ్యూహమన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టును పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.

  • 02 Feb 2021 10:34 AM (IST)

    కళా వెంకట్రావ్‌ హౌజ్ అరెస్ట్

    రాజాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. అచ్చెన్న అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన నిమ్మాడ బయలుదేరాలని భావించారు. అయితే పోలీసులు అందుకు అనుమతించలేదు. మరోవైపు అచ్చెన్న అరెస్ట్‌పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. పంచాయితీ ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ వైఖరి గర్హనీయమన్నారు

  • 02 Feb 2021 10:27 AM (IST)

    నిమ్మాడలో భారీగా మోహరించిన బలగాలు

    నిమ్మాడలో పంచాయతీ అభ్యర్థిపై గందరగోళం నెలకొంది. ఇతర పార్టీకి చెందిన (అనుబంధ సభ్యులు) నామినేషన్ వేస్తే ఇబ్బందులు సృష్టించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు/ రామ్మోహన్ నాయుడు ప్రాబల్యం ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించడంతో హై టెన్షన్ నెలకొంది. నిన్నటి నుంచి ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాలను మొహరించారు.

  • 02 Feb 2021 09:53 AM (IST)

    నిమ్మాడలో హైటెన్షన్

    మూడు రోజులుగా నిమ్మాడ రగిలిపోతోంది. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువువే వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు. ఇక్కడే అసలు వివాదం రాజుకుంది.

  • 02 Feb 2021 09:37 AM (IST)

    అచ్చెన్న నివాసం వద్దకు చేరుకుంటున్న కార్యకర్తలు

    పంచాయతీ తొలివిడత నామినేషన్లలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్న అరెస్ట్ విషయం తెలిసి ఆయన నివాసం వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు.

  • 02 Feb 2021 09:13 AM (IST)

    అచ్చెన్న అరెస్ట్‌పై బాబు ఫైర్

    అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.  ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారని అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని చెప్పారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవు. ప్రశాంతగ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..? అని ప్రశ్నించారు.  దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..?..అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా….? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

    వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలన్న బాబు.. దువ్వాడ శ్రీనివాస్ పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం గర్హనీయమన్నారు. ఐపిసిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు.. అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా అంటూ ఫైరయ్యారు.

  • 02 Feb 2021 09:00 AM (IST)

    అచ్చెన్నాయుడి  అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట : నారా లోకేష్

    పంచాయతీ ఎన్నికల వేళ అచ్చెన్నాయుడి  అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  నిమ్మాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

    నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైకాపా నేత  దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని ఆరోపించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, గొల్లలగుంట గ్రామంలో టిడిపి బలపర్చిన సర్పంచి అభ్యర్థి పుష్పవతి  శ్రీనివాసరెడ్డిని హత్య చేశారని చెప్పారు. తాజాగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని.. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు లోకేశ్.

Published On - Feb 02,2021 12:13 PM