AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Local Body Elections 2nd-Phase Nominations Live Updates: రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు ఎస్ఈసీ కి ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతున్నా మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. తాజాగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ...

Ap Local Body Elections 2nd-Phase Nominations Live Updates:  రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Surya Kala
|

Updated on: Feb 02, 2021 | 12:19 PM

Share

2nd-Phase Nominations Live Updates: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు ఎస్ఈసీ కి ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతున్నా మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. తాజాగా రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన జరగనుంది.. ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించనున్నారు. ఇక, ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉప సంహరణగా ఎస్ఈసీ నిర్ణయించింది.

ఈనెల 13తేదీన 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం అదే రోజున ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా ఉంటుంది. మొత్తం 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించదానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Feb 2021 12:15 PM (IST)

    జగ్గంపేట మండలం గొల్లలగుంటలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

    తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటిస్తున్నారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ రెడ్డి కిడ్నప్ అనంతరం ఉరేసుకుని అనుమానాస్పద మృతి నేపథ్యంలో గ్రామంలో రాజకీయ విబేధాలు బయటపడ్డాయి. దీంతో గ్రామంలోని తాజాగా  పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. పరిస్థితులను అంచనా వేసిన అనంతరం అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం కాకినాడ లో ఎన్నికల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

  • 02 Feb 2021 11:59 AM (IST)

    వైసీపీ అక్రమాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం : సోము వీర్రాజు

    పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను భయపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. వైసీపీ అక్రమాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ను వైసీపీ పోటీ పార్టీగా భావిస్తోందని వ్యాఖ్యానించారు

  • 02 Feb 2021 11:41 AM (IST)

    టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగుల దాడి.. కారు ధ్వంసం

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఆయన కారును కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరుతుండగా పట్టాభి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పట్టాభికి గాయాలయ్యాయి. సుమారు 10 మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నారని స్థానికులు చెప్పారు.

    కాగా టీడీపీ లీడర్ పట్టాభిపై దాడి జరగటం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం కూడా ఆయన వాహనంపై దుండగులు దాడి చేశారు. తనపై జగన్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దాడికి యత్నిస్తోందని ఆయన గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

  • 02 Feb 2021 11:10 AM (IST)

    మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే ఈసీ లక్ష్యం.. స్పీకర్ ఏ చర్యలు తీసుకున్నా స్వాగతిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ తీసుకునే చర్యలు తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నవిగానే ఉన్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ను ఇబ్బంది పెడుతుందని గవర్నర్ కి ఈసీ లేఖ రాశారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మా ప్రభుత్వ ప్రతిష్టాతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే  స్పీకర్ కి పిర్యాదు చేశామని తెలిపారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని .. రాజ్యాంగ బద్ధమైన సంస్థ చట్ట ప్రకారం నడుచుకోవాలని అన్నారు .. అసలు మా ప్రభుత్వాన్ని సంజాయిషీ అడగకుండా గవర్నర్ కి ఎలా పిర్యాదు చేసారని నిమ్మగడ్డను ప్రశ్నించారు. టీడీపీ నేతల మీద వైసిపీ నేతలు ఎక్కడ దాడులు చేయలేదు.. అచ్చెన్నాయుడు అరెస్ట్ వాళ్ళ కుటుంబ వ్యవహారమని తేల్చి చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి .

  • 02 Feb 2021 11:02 AM (IST)

    ఏకగ్రీవాలవైపు మొగ్గుచూపాలనే ప్రచారం మంచి కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి: నిమ్మగడ్డ

    విశాఖ జిల్లా ఎన్నికలను సమీక్షిస్తున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కంటే ఓటింగ్ పెంచడం ద్చారా విశాఖ విశిష్టతను పెంచాలని కోరారు. ఎన్నికల అధికారుల మదిలో రాజ్యాంగం ఉందని .. రాజ్యాంగం చెప్పిందే తాము చెబుతామన్నారు నిమ్మగడ్డ – ప్రజాస్వామ్య వ్యవస్థను హలపరచడానికి విస్తృత అధికారాలుంటాయని.. ఎన్నికల్లో ఓటు వేసే వాతావరణం కల్పిస్తున్నామని అందరినీ అందరినీ సమాన ధోరణితీ చూస్తామని తెలిపారు. ఏకగ్రీవాల వైపు మొగ్గుచూపాలనే ప్రచారం మంచిది కాదు.. భిన్మత్వంలో ఏకత్వం తీసుకురావడమే ప్రజాస్వామ్యమన్నారు నిమ్మగడ్డ. రేపు ఎన్నికల కార్యాలయంలో నిఘా వ్యవస్థను ప్రారంభిస్తున్నామని ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై దృష్టి సారిస్తామని తెలిపారు.

  • 02 Feb 2021 10:52 AM (IST)

    విశాఖ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తి.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగలించుకోవాలని ఎస్‌ఈసీ పిలుపు

    ఉత్తరకోస్తా ప్రటనలో భాగంగా విశాఖ జిల్లాలో అడిషనల్ డీజీ సంజయ్, తాను పర్యటిస్తున్నామని నిమ్మగడ్డ చెప్పారు. విశాఖ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. ఏపీలో అత్యంత ప్రతిభావంతులైన అధికారులు విశాఖలో ఉన్నారని ఏర్పాట్లతో పాటు అవగాహన కల్పించారని తెలిపారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రచార మాధ్యమాల ద్వారా విజ్నప్తి చేస్తున్నా.. ఎన్నికల్లో ప్రజలు పాలుపంచుకోవాలఐ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగలించుకోవాలని పిలుపునిచ్చారు

  • 02 Feb 2021 10:13 AM (IST)

    జగ్గంపేటలో ఉదయం పర్యటించనున్న నిమ్మగడ్డ.. మధ్యాహ్నం లోకేష్

    ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పై వివాదాస్పద ప్రాంతాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో పర్యటించనున్నారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ రెడ్డి కిడ్నప్ అనంతరం ఉరేసుకుని అనుమానాస్పద మృతి నేపథ్యంలో గ్రామంలో రాజకీయ విబేధాలు బయటపడ్డాయి. దీంతో అక్కడ తాజా పరిస్థితులను సమీక్షించడానికి అధికారులకు సూచనలు ఇవ్వడానికి రమేష్ వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం కాకినాడ లో ఎన్నికల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు నారా లోకేష్ పర్యటించనున్నారు. దీంతో రాజకీయ దుమారం మళ్ళీ చెలరేగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది.

  • 02 Feb 2021 09:30 AM (IST)

    నిమ్మగడ్డ వ్యవహారం కక్ష సాధింపు చర్యగా ఉందని మండిపడ్డ ఆర్టీఐ మాజీ కమిషనర్

    ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య మాటన యుద్ధం ఓ రేంజ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ తీరుపై వైసీపీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తుండగా.. తాజాగా ఆయన చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్, ఏపీ ఇంటెలెక్చువల్స్‌ అండ్‌ సిటిజెన్స్‌ ఫోరం చైర్మన్‌ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ వ్యవహారం కక్ష సాధింపు చర్యగా ఉందని మండిపడ్డారు.

    నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని.. వెంటనే అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ద్వారా నోటీసులివ్వాలని, కమిటీ ముందుకు రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనకు ఆయన అవరోధం సృష్టిస్తున్నారన్నారు. ఇలాగే ఒకప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకపోతే.. అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఆయన్ను అరెస్ట్‌ చేయాలని నిర్ణయించిందన్నారు. గవర్నర్, కోర్టును సంప్రదించడానికి కూడా సమయం ఇవ్వకుండానే అరెస్టు చేయించిందని విజయబాబు గుర్తుచేశారు.

  • 02 Feb 2021 09:24 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలోని ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ సంతృప్తి.. అధికారులకు పలు సూచనలు

    శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఇప్పటికే కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ అమిత్‌బర్దార్‌ వ్యవస్థాగతంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఇక్కడ మానవ వనరుల కొరత దృష్ట్యా పనిభారం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఇక్కడ మానవ వనరుల కొరత దృష్ట్యా పనిభారం కూడా ఎక్కువగా ఉంటుందని అందుకనే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు రెండు విడతలుగా విధులు నిర్వహించాల్సి వస్తుందని చెప్పారు నిమ్మగడ్డ.

    శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందించారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి. అప్పుడే సంతృప్తి ఉంటుంది. సున్నితమైన గ్రామాలను గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

  • 02 Feb 2021 09:09 AM (IST)

    ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్

    ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు అచ్చెన్నాయుడపై ఆరోపణలున్నాయి. దీంతో ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక నేడు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లనున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు.

    నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు.

Published On - Feb 02,2021 12:15 PM