AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో నిర్భందించుకుని కుటుంబం వింత పూజలు.. హడలిపోయిన స్థానికులు.. చివరకు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంటహత్యల ఉదాంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో అటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇంట్లో నిర్భందించుకుని కుటుంబం వింత పూజలు.. హడలిపోయిన స్థానికులు.. చివరకు
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2021 | 12:47 PM

Share

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంటహత్యల ఉదాంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో అటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖలో ఓ ఇంట్లోని వారు కొన్ని గంటలపాటు చేసిన పూజలు స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. విశాఖపట్నం గాజువాకలోని అజీమాబాద్‌లో వింతపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. మజీద్‌ అనే వ్యక్తి తన కుటుంబం తమని తాము ఇంట్లో స్వీయ నిర్భందం చేసుకున్నారు. మజీద్‌తో పాటు అతని భార్య ఇద్దరు పిల్లలు కొన్ని గంటలపాటు ఇంట్లోనే ఉండి పూజలు చేశారు.

ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉండి తలుపులు వేసుకుని పూజలు చేస్తూ..ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు భయపడిపోయారు. లోపల పూజలు చేసే ఆనవాళ్లు కనిపించడంతో అంతా కలవరపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మజీద్‌ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మజీద్‌పాటు అతని కొడుకు నూరుద్దీన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే, మజీద్‌ మానసికంగా బాధపడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మొత్తానికి సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

Cleaning of The Corpses: సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి సంవత్సరీకం జరిపే గ్రామం..

Six Times Winner: ఇతన్ని అదృష్టానికి అంబాసిడర్ అనాలేమో.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా..