రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ధర పెరిగింది

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధర మరోసారి పెరిగింది. కరోనా నేపథ్యంలో బుల్లెట్‌ 350 బీఎస్‌6 మోడల్స్‌ ధరలను పెంచుతూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో బుల్లెట్‌ 350 మూడు వేరియంట్లలో లభిస్తుండగా..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ధర పెరిగింది
Follow us

|

Updated on: Sep 15, 2020 | 10:37 PM

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధర మరోసారి పెరిగింది. కరోనా నేపథ్యంలో బుల్లెట్‌ 350 బీఎస్‌6 మోడల్స్‌ ధరలను పెంచుతూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో బుల్లెట్‌ 350 మూడు వేరియంట్లలో లభిస్తుండగా.. ఆ మూడింటి ధరలను పెంచేసింది. బుల్లెట్‌ ఎక్స్‌, స్టాండర్డ్‌ బ్లాక్‌, టాప్‌ఎండ్‌ ఈఎస్ వేరియంట్లలో బుల్లెట్‌ 350 సీసీ బైక్ అందుబాటులో ఉంది. అయితే, వాటి ఎక్స్‌ షోరూం ధరపై 2 శాతం వరకు పెంచుతున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది.

2 శాతంగా తీసుకున్నా.. ఒక్కో బుల్లెట్ ధర రూ.2,756 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 మోడల్స్‌ కొత్త ధరలను ఓ సారి పరిశీలిస్తే.. ఢిల్లీలో ఎక్స్‌ షోరూం ధరలు.. బుల్లెట్‌ ఎక్స్‌ 350 ధర రూ.1,27,093గా, బుల్లెట్ 350 (బ్లాక్‌) ధర రూ.1,33,260గా.. బుల్లెట్‌ ఎక్స్‌ 350 ఈఎస్‌ ధర రూ. 1,42,705గా ఉండనుంది. అయితే ఆయా ప్రాంతాలను బట్టి.. ఈ ధరలో కాస్త మార్పులు ఉండొచ్చు.