ఢిల్లీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరింస్తోంది. ఈ ప్రభావంతో  కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4,263 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,25,796కు చేరుకుందని...

ఢిల్లీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Sep 15, 2020 | 9:07 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరింస్తోంది. ఈ ప్రభావంతో  కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4,263 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,25,796కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ లో వెల్లడించింది.

ఇవాళ 36 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు 4,806 మంది మరణించారు. ప్రస్తుతం 29,787 యాక్టీవ్‌ కేసులుండగా.. మొత్తం 1,91,203 మంది రికవర్‌ అయ్యారు. అయితే ఢిల్లీలో ఇప్పటికే అన్ని వాణిజ్య, వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. సామాన్య జనం తమ వ్యవహారాల్లో బిజీగా మారుతున్నారు. సినిమా హాల్స్, విద్యా వ్యవస్థలు మినహా అన్ని తెరుచుకున్నాయి. వైన్ షాపులు ఇప్పటికే తెరిచారు.

అయితే కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.