AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాట్‌మన్‌ హీరో రాబర్ట్‌ పాటిన్‌సన్‌కు కరోనా

బ్యాట్‌మన్‌ హీరో రాబర్ట్ పాటిన్‌సన్‌కు కూడా కరోనా వైరస్‌ అంటుకుంది.. దీంతో సినిమా షూటింగ్‌ను అనివార్యంగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.. కరోనా వైరస్‌ బ్యాట్‌మన్‌ సినిమాను అష్టకష్టాలు పెడుతోంది.

బ్యాట్‌మన్‌ హీరో రాబర్ట్‌ పాటిన్‌సన్‌కు కరోనా
Balu
|

Updated on: Sep 04, 2020 | 1:36 PM

Share

బ్యాట్‌మన్‌ హీరో రాబర్ట్ పాటిన్‌సన్‌కు కూడా కరోనా వైరస్‌ అంటుకుంది.. దీంతో సినిమా షూటింగ్‌ను అనివార్యంగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.. కరోనా వైరస్‌ బ్యాట్‌మన్‌ సినిమాను అష్టకష్టాలు పెడుతోంది.. సజావుగా సాగిపోతున్న షూటింగ్‌కు లాక్‌డౌన్‌ బ్రేక్‌ వేసింది.. ఆన్‌లాక్‌ తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టిన కొన్ని రోజులకే హీరోకే కరోనా పాజిటివ్‌ రావడంతో మళ్లీ ఆపేయాల్సి వచ్చింది.. సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్టు అమెరికా వార్త సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రొడక్షన్‌ టీమ్‌లో ఒకరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్టు సినిమా నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ అధికారికంగా ప్రకటించింది.. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం చెప్పడం లేదు.. ఈ ఏడాది జనవరిలో గ్లాస్గోలో బ్యాట్స్‌మన్‌ షూటింగ్ మొదలయ్యింది.. నిజానికి వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్‌ కావాలి.. ఇలా షూటింగ్ పదే పదే వాయిదా పడుతుండటంతో రిలీజ్‌ను వచ్చే ఏడాది అక్టోబర్‌కు పోస్ట్‌పోన్‌ చేశారు. ఇంతకు ముందు బ్యాట్‌మన్‌గా క్రిస్టియన్‌ బాలే, బెన్‌ అఫ్లెక్‌, జార్జి క్లూనీ వంటి వారు నటించారు.. బ్యాట్‌మన్‌గా నటించడం రాబర్ట్‌ పాటిన్‌సన్‌కు ఇదే ప్రథమం. ట్విలైట్‌, టెనెట్‌ సినిమాలతో తనెంటో ప్రూవ్‌ చేసుకున్న రాబర్ట్‌ పాటిన్‌సన్‌కు ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోతుందని అనుకుంటున్నారంతా! మొన్నీమధ్యనే ఈ సినిమా ట్రైలర్‌ కూడా రిలీజయ్యింది.. ట్రైలర్‌ చూస్తే మాత్రం ఇప్పటికే సినిమా చాలా భాగం పూర్తయిందని అనిపిస్తోంది..

Follow Us
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోకుంటే రేషన్‌ నిలిపివేత...?
6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోకుంటే రేషన్‌ నిలిపివేత...?
పితృ పక్షంలో పొరపాటున చేయకూడని పనులివే.. చేస్తే పేదవారే
పితృ పక్షంలో పొరపాటున చేయకూడని పనులివే.. చేస్తే పేదవారే
పులిసిన, పాతబడిన పెరుగు తింటున్నారా? అయితే, శరీరంలో జరిగేది ఇదే!
పులిసిన, పాతబడిన పెరుగు తింటున్నారా? అయితే, శరీరంలో జరిగేది ఇదే!
అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి..
అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి..
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?
ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది