Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి

రాజస్థాన్ లో రోడ్డు రక్తసిక్తం అయింది.  జీపును ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఎనిమిది  మంది ప్రాణాలు కోల్పోయారు. జైపూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది

Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2021 | 8:49 AM

Road Accident : రాజస్థాన్ లో రహదారి రక్తసిక్తం అయింది. జీపును ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఎనిమిది  మంది ప్రాణాలు కోల్పోయారు. జైపూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. రాజ్‌గఢ్‌ ప్రాంతానికి వీరు రాజస్థాన్‌లోని ప్రముఖ ఆలయం ఖాటూశ్యామ్‌ జీ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరిగి  వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న జీపును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే  మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వనస్థలిపురంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. కుటుంబసభ్యుల అప్రమత్తతతో తప్పిన ముప్పు