బస్సు, కంటైనర్ ఢీ.. 12 మంది మృతి
మహారాష్ట్రలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దులే జిల్లా దొండైచ సమీపంలో బస్సు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ఔరంగబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.