మాజీ ఎంపీలు.. ఇంకా ఎప్పుడు బంగళాలు ఖాళీ చేస్తారు..?

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. మాజీ ఎంపీలు మాత్రం వారి ప్రభుత్వం బంగళాలను ఖాళీ చేయడం లేదు. ఢిల్లీలోని లుటియేన్స్ ప్రాంతంలో 16వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల కోసం బంగళాలను కేటాయించారు. అయితే లోక్‌సభ రద్దయిన తేదీ నుంచి ఒక నెలలోగా మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాలని నిబందనలు చెప్తున్నాయి. 16వ లోక్‌సభను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 25న రద్దు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:50 am, Mon, 19 August 19
మాజీ ఎంపీలు.. ఇంకా ఎప్పుడు బంగళాలు ఖాళీ చేస్తారు..?

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. మాజీ ఎంపీలు మాత్రం వారి ప్రభుత్వం బంగళాలను ఖాళీ చేయడం లేదు. ఢిల్లీలోని లుటియేన్స్ ప్రాంతంలో 16వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల కోసం బంగళాలను కేటాయించారు. అయితే లోక్‌సభ రద్దయిన తేదీ నుంచి ఒక నెలలోగా మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాలని నిబందనలు చెప్తున్నాయి. 16వ లోక్‌సభను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 25న రద్దు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర మంత్రివర్గం సిఫారసు మేరకు రద్దు చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు అధికారిక బంగళాలను దాదాపు 200 మంది మాజీ ఎంపీలు ఖాళీ చేయడం లేదని అధికారులు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైనవారికి బంగళాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.