బ్రెజిల్ రాష్ట్ర గవర్నరుకు కరోనా పాజిటివ్..
కోవిద్-19 మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. బ్రెజిల్ లోని రాష్ట్ర గవర్నరు విల్సన్ విట్జెల్ కు కరోనా వైరస్ సోకింది. రియో డి జనీరో రాష్ట్ర గవర్నర్ విల్సన్ విట్జెల్ కు అనారోగ్యానికి గురవడంతో అతనికి

కోవిద్-19 మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. బ్రెజిల్ లోని రాష్ట్ర గవర్నరు విల్సన్ విట్జెల్ కు కరోనా వైరస్ సోకింది. రియో డి జనీరో రాష్ట్ర గవర్నర్ విల్సన్ విట్జెల్ కు అనారోగ్యానికి గురవడంతో అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని మంగళవారం రాత్రి వెల్లడైంది. ‘‘నాకు కరోనా లక్షణాలైన జ్వరం, గొంతునొప్పి సమస్యతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చింది’’ అంటూ గవర్నర్ విల్సన్ ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
కాగా.. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి తన పని చేసుకుంటూ వైద్యుల సలహా పాటిస్తూ కోలుకుంటున్నానని గవర్నర్ విల్సన్ పేర్కొన్నారు. బ్రెజిల్ దేశంలో 24వేల మందికి కరోనా సోకింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ ఫాబియో వాజన్ గార్టెన్ కు కూడా కరోనా సోకింది.
Also Read: లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..