లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..
తెలంగాణలో కోవిద్-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 45 శాతం కేసులు ఉండటంతో... ప్రభుత్వం... లాక్‌డౌన్‌ను మరింత బలంగా అమలు చెయ్యాలని నిర్ణయించుకుంది. అలాగే... కేసులు

తెలంగాణలో కోవిద్-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 45 శాతం కేసులు ఉండటంతో… ప్రభుత్వం… లాక్‌డౌన్‌ను మరింత బలంగా అమలు చెయ్యాలని నిర్ణయించుకుంది. అలాగే… కేసులు ఎక్కువగా ఉన్న 139 ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను రెడీ చేసింది. ఈ ప్రాంతాల్ని పూర్తిగా కంట్రోల్‌లో ఉంచబోతోంది. కంటైన్మెంట్ జోన్లకు సర్కిల్, జోనల్ స్థాయిలో నోడల్ బృందాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ GHMC సిబ్బంది ఎలాంటి రూల్స్ పాటించాలో… ఓ ప్రకటన ప్రభుత్వం రిలీజ్ చేసింది.
రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో దారుల్ని 8 అడుగుల ఎత్తుండే బారికేడ్లతో మూయాలి. ఈ జోన్లలోకి వెళ్లి, వచ్చేందుకు ఒకటే రూట్ ఉండాలి. జోన్లను 24 గంటలూ పోలీసులు పర్యవేక్షించాలి. జోన్లలో వాళ్లు బయటకు రాకూడదు. బయటి వాళ్లు లోపలికి వెళ్లకూడదు. పోలీసుల్లో ఏఎస్సై లేదా ఎస్సై లేదా సీఐ స్థాయి ఆఫీసర్ పర్యవేక్షించాలి. జోన్లలో ఉండేవారికి నిత్యవసరాలు అందించేందుకు ఓ నోడల్ ఆఫీసర్, శానిటైజేషన్ కార్యక్రమాలకు మరో ఆఫీసర్ ఉండాలి. అలాగే ఓ బిల్ కలెక్టర్ ఉంటారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి.. నిత్యవసరాలు ఇస్తారు. మాస్కులు కూడా ఇస్తారు.
కాగా.. ఈ కంటైన్మెంట్ జోన్లలో రోజూ శానిటేషన్ (శుభ్రత-పరిశుభ్రత) ఉంటుంది. రోజుకు రెండుసార్లు… సూక్ష్మక్రిములను చంపే రసాయానాల్ని పిచికారీ చేస్తారు. ఈ పని అధికారులు మాత్రమే చేస్తారు. ప్రజలు చెయ్యకూడదు.కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజూ ఫీవర్ సర్వే ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాజిటివ్ అని తేలితే… వారిని ఐసోలేషన్‌కి తరలించి… వారి కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్క వారిని క్వారంటైన్‌కి తరలిస్తారు. వారి చేతిపై క్వారంటైన్ ప్రింట్ (ముద్ర లేదా స్టాంప్) వేస్తారు.