టీటీడీ సంచలన నిర్ణయం..కరోనా సాయంగా ఒక్కో జిల్లాకు కోటి..
కలికాలం చల్లగా చూసే వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుబడులు, కానుకలు చెల్లించుకోవడం ఆనవాయితీ. కొందరు నిలువు దోపిడీ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం లోకం సుభిక్షంగా లేదు. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం వణికిపోతుంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో బడుగు, బలహీన వర్గాలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే పేదవారి ఆకలి తీర్చేందుకు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడే కదిలాడు. అవును ఏపీలో పేదల కష్టాలు తీర్చేందుకు టీటీడీ నడుం బిగించింది. […]

కలికాలం చల్లగా చూసే వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుబడులు, కానుకలు చెల్లించుకోవడం ఆనవాయితీ. కొందరు నిలువు దోపిడీ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం లోకం సుభిక్షంగా లేదు. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం వణికిపోతుంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో బడుగు, బలహీన వర్గాలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే పేదవారి ఆకలి తీర్చేందుకు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడే కదిలాడు. అవును ఏపీలో పేదల కష్టాలు తీర్చేందుకు టీటీడీ నడుం బిగించింది. తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి సాయం చేయడం కోసం రూ.13 కోట్లు విడుదల చేయబోతుంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఈవో అనిల్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.1 కోటి చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు.