AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గబ్బిలాల్లో కరోనా వైరస్.. కానీ..

ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు జాతులకు చెందిన గబ్బిలాల్లో వేర్వేరు రకాల కరోనా వైరస్ లు ఉన్నట్టు కనుగొన్నారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని ఈ జాతుల గబ్బిలాలను రీసెర్చర్లు పరిశోధించినప్పుడు మొదటిసారిగా ఈ విషయం వెల్లడైంది.

గబ్బిలాల్లో కరోనా వైరస్.. కానీ..
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 1:45 PM

Share

ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు జాతులకు చెందిన గబ్బిలాల్లో వేర్వేరు రకాల కరోనా వైరస్ లు ఉన్నట్టు కనుగొన్నారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని ఈ జాతుల గబ్బిలాలను రీసెర్చర్లు పరిశోధించినప్పుడు మొదటిసారిగా ఈ విషయం వెల్లడైంది. ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన అధ్యయనంలో  దీని గురించి వివరిస్తూ.. ఏది ఏమైనా ఈ వైరస్ ల వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ బ్యాట్ కరోనా వైరస్ ని ‘బీ టీ కోవ్’ అని వ్యవహరిస్తున్నారు. ఈ దేశంలోని గబ్బిలాల్లో కరోనా వైరస్ సర్క్యులేషన్ గురించి తెలుసుకోవడంలో ఈ స్టడీ ఓ ముందడుగని భావిస్తున్నారు. మానవులకు ఈ వైరస్ ల కారణంగా వ్యాధులు సంక్రమిస్తాయనడానికి ఆధారాలు  లేనప్పటికీ..ఇతర  వివరాలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అంటున్నారు. వ్యాప్తి చెందే వైరస్, రిస్క్ మిటిగేషన్ ( ముప్పు నివారణ) అన్న అంశాలను తాము స్టడీ చేస్తున్నట్టు ఈ అధ్యయన తొలి వ్యాసకర్త ప్రగ్యా డీ. యాదవ్ తెలిపారు.

చైనాలోని వూహాన్ లో గల గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందాయని భావిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి ఎన్నో అధ్యయనాలు, థియరీలు బయటకి వచ్చాయని, అయితే మన దేశంలోని ఈ నాలుగు రాష్ట్రాల్లో గల గబ్బిలాల్లో కనుగొన్న వైరస్ కి. వూహాన్ గబ్బిలాల వైరస్ కి ఎంతో తేడా ఉందని యాదవ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో రూసెటస్, టెరోపస్ అనే రెండు జాతుల గబ్బిలాల్లో  ఈ వైరస్ ని కనుగొన్నప్పటికీ కోవిడ్-19 కి కారణమైన ‘సార్స్-కోవ్ -2’ కి ఇది సంబందించినది కాదని స్పష్టం చేశారు. వీటిలో టెరోపస్ జాతి గబ్బిలాల్లో కేరళలో 2018.,2019 సంవత్సరాల్లో బయటపడిన నిఫా వైరస్ ని కనుగొన్నట్టు ఆయన వివరించారు. అయితే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో