క్వారెంటైన్‌లోకి ముఖ్యమంత్రి… వారంపాటు ఎవరినీ కల్వరంట!
ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. కరోనా కట్టడికి గత నెల రోజులుగా యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే ఇపుడు క్వారెంటైన్‌లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. కారణం కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు తనను ఒకటికి రెండు సార్లు కల్వడమే.. ఇంతకీ ఆయన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి?

ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. కరోనా కట్టడికి గత నెల రోజులుగా యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే ఇపుడు క్వారెంటైన్‌లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. కారణం కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను ఒకటికి రెండు సార్లు కల్వడమే.. ఇంతకీ ఆయన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? రీడ్ దిస్.
తొలుత గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ షాక్ అయ్యారు. కారణం సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గత వారం, పది రోజుల్లో ఒకటి, రెండు సార్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కల్వడమే. ఆ తర్వాత మంగళవారం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్ షేక్‌కు ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యలే గత వారం, పది రోజుల్లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పలు మార్లు కల్వడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
పాజిటివ్‌గా తేలిన ఎమ్మెల్యేలు తనను కల్వడంతో ఇపుడు ముఖ్యమంత్రి స్వయంగా క్వారెంటైన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది. వారం రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని విజయ్ రూపానీ నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా ఆయన సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అన్ని సాధారణ రిపోర్టులు రావడంతో సీఎం హోం క్వారెంటైన్‌కు పరిమితమైతే చాలనుకున్నారు.
వారం రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని, సమీక్షలను వీడియోకాన్ఫరెన్సు ద్వారా నిర్వహించాలని విజయ్ రూపానీ నిర్ణయించుకున్నారు. సీఎం నివాసంలోకి ఇతరులు ఎవరికి ప్రవేశ అనుమతి లేదని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్, డిజిటల్ పద్ధతుల్లో అధికారిక సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని సీఎంవో వర్గాలు ప్రకటించాయి. ఈ జాగ్రత్తలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో తీసుకున్నవేనని వారంటున్నారు.
Read this: ఏపీలో ఏకంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు.. జగన్ సంచలన ఆదేశం
Read this: బాబోయ్.. 477 జిల్లాలకు కరోనా ప్రమాదం.. కేంద్రం వార్నింగ్
Read this: ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే