త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం : రిలయన్స్ ఇండస్ట్రీస్

జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రూ.9567 కోట్ల లాభం ఆర్జించింది. టెలికాం, రిటైల్ రంగాల్లో సంస్థ ఆదాయం బాగా పెరిగింది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.8380 కోట్ల లాభాలను ఆర్జిస్తే, రెండో త్రైమాసికం వచ్చేసరికి అది రూ.9567 కోట్లకు పెరిగింది. దీంతో అంచనాలకు మించిన లాభాలను రిలయన్స్ నమోదు చేసినట్టైంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ప్రకటించిన రూ.13,248 కోట్లలో రిలయన్స్ బీపీ మొబిలిటీ కోసం బిపీ […]

త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం : రిలయన్స్ ఇండస్ట్రీస్
Follow us

|

Updated on: Oct 30, 2020 | 9:57 PM

జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రూ.9567 కోట్ల లాభం ఆర్జించింది. టెలికాం, రిటైల్ రంగాల్లో సంస్థ ఆదాయం బాగా పెరిగింది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.8380 కోట్ల లాభాలను ఆర్జిస్తే, రెండో త్రైమాసికం వచ్చేసరికి అది రూ.9567 కోట్లకు పెరిగింది. దీంతో అంచనాలకు మించిన లాభాలను రిలయన్స్ నమోదు చేసినట్టైంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ప్రకటించిన రూ.13,248 కోట్లలో రిలయన్స్ బీపీ మొబిలిటీ కోసం బిపీ సంస్థకు విక్రయించిన స్టాక్స్ (రూ.4966 కోట్లు) కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా రెవిన్యూ రూ.1,53,384 కోట్లు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో అది రూ.1,16,195 కోట్లుగా ఉంది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో RIL Q2FY21 EBITDA రూ.18,945 కోట్లు నమోదు చేసింది. ఇదిలాఉంటే, రిలయన్స్ జియో రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. మొత్తం రూ2844 కోట్ల లాభాలు వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2020 సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్ వద్ద 35 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్ 16 నాటికి రూ.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి చేరుకుంది. ఫలితంగా ఆ సంస్థ షేర్ ధర రూ.2,369.35కి చేరింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!