AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌త్ చెల‌రేగిపోవడానికి అత‌డే కార‌ణం : పాంటింగ్‌

జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డంలో ధోనీకి, తనకు ఎంతో డిఫ‌రెన్స్ ఉంద‌ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ సార‌థిగా ఉన్న‌ప్పుడు ప్లేయ‌ర్స్ ఎంతో స్వేచ్ఛగా ఆడేవారని చెప్పుకొచ్చాడు.

భార‌త్ చెల‌రేగిపోవడానికి అత‌డే కార‌ణం : పాంటింగ్‌
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2020 | 5:12 PM

Share

జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డంలో ధోనీకి, తనకు ఎంతో డిఫ‌రెన్స్ ఉంద‌ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ సార‌థిగా ఉన్న‌ప్పుడు ప్లేయ‌ర్స్ ఎంతో స్వేచ్ఛగా ఆడేవారని చెప్పుకొచ్చాడు. మ‌హీ‌ ఎందుకంత స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌ అయ్యాడో.. ధోని పోలిస్తే తనలో లేని ఓ మెయిన్ క్వాలిటీని పాంటింగ్ వివరించాడు. ‘ఫీల్డ్‌లో ధోనీ తన ఎమోష‌న్స్ ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాడు. అది అతడిలోని ఓ బెస్ట్ క్వాలిటీ. అలా ఉండేందుకు నేను ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ నాకు సాధ్యప‌డ‌లేదు. నేను ఎప్పుడూ పూర్తి కంట్రోల్‌లో లేను’ అని ఇటీవ‌ల‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

భారత మాజీ కెప్టెన్ ధోని ప్రపంచవ్యాప్తంగా ఉన్నఫ్యాన్స్ ఉన్నార‌ని, తాను ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు అభిమానులు ధోనీ గురించి మాట్లాడుకోవడం విన్నానని పాటింగ్ తెలిపాడు. అతడి లీడ‌ర్షిప్, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే అతడి తత్వం గురించి అభిమానులు ఎక్కువ‌గా మాట్లాడుకునేవార‌ని తెలిపాడు.

కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మెయిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ.. ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్

Follow Us