రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ కొట్టివేత..
డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు కొట్టివేసింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మిరండాతో సహా ఆరుగురు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.
Rhea Chakraborty Bail Denied: డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు కొట్టివేసింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మిరండాతో సహా ఆరుగురు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రియాకు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు అడ్డంకులు ఎదురవుతాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వాదించగా.. ఆ వాదనకు కోర్టు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీనితో రియా చక్రవర్తి సెప్టెంబర్ 22 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనుంది. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియాపై ముందు నుంచి ఆరోపణలు వస్తున్న విషయం విదితమే.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..