విషాదం.. వృద్ధాశ్ర‌మంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకుని బ‌లైన 11 మంది వృద్ధులు

భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్ర‌మంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 11 మంది మ‌ర‌ణించారు. బాష్‌కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉర‌ల్ ప‌ర్వ‌త ‌శ్రేణుల్లో ఉన్న ఓ రిటైర్మెంట్...

విషాదం.. వృద్ధాశ్ర‌మంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకుని బ‌లైన 11 మంది వృద్ధులు
Anil kumar poka

|

Dec 15, 2020 | 12:42 PM

ర‌ష్యాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్ర‌మంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 11 మంది మ‌ర‌ణించారు. బాష్‌కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉర‌ల్ ప‌ర్వ‌త ‌శ్రేణుల్లో ఉన్న ఓ రిటైర్మెంట్ హోమ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ అగ్ని ప్ర‌మాదంలో భారీగా మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటా హుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

అయితే హోమ్‌లో ఉన్న వారంతా వృద్ధులు కావ‌డంతో అగ్ని ప్ర‌మాదంలో ఎటు క‌ద‌ల‌లేక‌పోయారు. దీంతో వాళ్లు మంట‌ల్లో చిక్కుకుని బ‌ల‌య్యారు. ఈ ప్ర‌మాదం నుంచి న‌లుగురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ర‌ష్యా ఏజ‌న్సీ ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న పై విచార‌ణ‌కు ఆదేశించారు ర‌ష్యా అధికారులు. అయితే ఈ అగ్ని ఎలా జ‌రిగింద‌నే దానిపై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను అక్క‌డి మంత్రిత్వ‌శాఖ ఆదేశించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu