సామాన్యుడి నెత్తిన మ‌రో భారం.. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌.. 15 రోజుల వ్య‌వ‌ధిలోనే రెండోసారి పెంపు

సామాన్యుడికి మరో భారం పడనుంది. ఒక వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగిపోతున్న నేపథ్యంలో రాయితీ గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి సామాన్యుడి నడ్డి విరిచాయి....

  • Anil kumar poka
  • Publish Date - 12:10 pm, Tue, 15 December 20
సామాన్యుడి నెత్తిన మ‌రో భారం.. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌.. 15 రోజుల వ్య‌వ‌ధిలోనే రెండోసారి పెంపు

సామాన్యుడికి మరో భారం పడనుంది. మరోసారి సబ్సిడీ సిలిండర్ ధర పెరిగింది. ఒక వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగిపోతున్న నేపథ్యంలో రాయితీ గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి సామాన్యుడి నడ్డి విరిచాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండో సారి. డిసెంబర్ 2న ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచిన చమురు సంస్థలు.. తాజా మంగళవారం మరో రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

వినియోగదారులకు రాయితీగా ఇచ్చే ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644గా ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.694కు చేరింది. మిగితా ప్రాంతాల్లోనూ ధరలు మోత మోగింది. ఇక 5 కిలోల సిలిండర్ పై 18 రూపాయలు, 19 కిలోల సిలిండర్ పై రూ.36.50 పెంచినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశాయి. అలాగే ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి.

ఇక గృహ అవసరాల కోసం కేంద్ర సర్కార్ అందించే గ్యాస్ రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కావాల్సి వస్తే మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..14.2 కిలోల గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ముంబైలో రూ.644, చెన్నైలో రూ.660గా ఉంది.

అలాగే ఈనెల‌లో వంట గ్యాస్ ధ‌ర డిసెంబ‌ర్ 2న మొద‌టిసారి పెంచ‌గా, ఇప్పుడు కూడా రూ.50 పెంచ‌డం సామాన్యుడికి షాకిచ్చిన‌ట్ల‌యింది. మొత్తం పెంపుతో రూ.100 అయింది. అస‌లే ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో మ‌ళ్లీ ధ‌ర పెర‌గ‌డం సామాన్యుడికి భారంగా మార‌నుంది.

ఇక గృహ అవసరాల కోసం కేంద్ర సర్కార్ అందించే గ్యాస్ రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కావాల్సి వస్తే మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.