పెద్ద పార్టీలతో పొత్తు వద్దు… కలిసి వచ్చే పార్టీతో ముందుకెళ్తాం.. సమాజ్ ‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్

శివపాల్ యాదవ్ నేత‌ృత్వంలోని ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నట్లు అఖిలేష్ యాదవ్‌ ప్రకటించారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తో ఎలాంటి ఎన్నికల అవగాహనలోకి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు.

  • Publish Date - 1:01 pm, Tue, 15 December 20 Edited By:
పెద్ద పార్టీలతో పొత్తు వద్దు... కలిసి వచ్చే పార్టీతో ముందుకెళ్తాం.. సమాజ్ ‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్

శివపాల్ యాదవ్ నేత‌ృత్వంలోని ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నట్లు అఖిలేష్ యాదవ్‌ ప్రకటించారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తో ఎలాంటి ఎన్నికల అవగాహనలోకి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. కలిసి వచ్చే చిన్న పార్టీలతో ముందుకెళ్తాం అని, కానీ ఈసారి పెద్ద పార్టీలతో పొత్తు ఉండదు’’ అని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. జస్వంత్ నగర్ స్థానాన్ని మామ శివపాల్ యాదవ్ కోసం సమాజ్‌వాదీ పార్టీ ఖాళీ చేసిందని చెప్పారు. 2022లో మేం అధికారంలోకి వస్తే వారి నాయకుడిని క్యాబినెట్ మంత్రిగా చేస్తాం అని అన్నారు.

 

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేరడం ఎస్పీని బలోపేతం చేస్తుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. కాగా, బీహార్ ఎన్నికల్లో కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిదని, అయితే బీజేపీయే కుట్ర రాజకీయాలు చేసి విజయాన్ని అడ్డుకున్నాయని తెలిపారు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి-మార్చిలో జరుగనున్నాయి. అ సమయానికల్లా నాలుగైదు చిన్నపార్టీలతో అవగాహనకు రావడం, ముందస్తుగానే అభ్యర్థులను రంగంలోకి దింపడంవంటి చర్యలకు సమాజ్‌వాదీ పార్టీ ఉపక్రమిస్తున్నది.