యమధర్మరాజు ఎందుకింత టైమ్ తీసుకున్నాడో..
Sensational comments : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై రిటైర్డ్ పోలీస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు తన ట్విటర్ వేదికగా స్వామి అగ్నివేశ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివేశ్.. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా రాసుకొచ్చారు. […]

Sensational comments : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై రిటైర్డ్ పోలీస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు తన ట్విటర్ వేదికగా స్వామి అగ్నివేశ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివేశ్.. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా రాసుకొచ్చారు.
స్వామి అగ్నివేశ్‌పై ట్విట్టర్ వేదికగా చేశారు. ‘స్వామి అగ్నివేశ్ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు నాగేశ్వర రావు .
