కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. తాజాగా ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా వైరస్ 73 రకాలుగా రూపాంతరం చెందుతుందని కనుగొన్నారు.

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!
Follow us

|

Updated on: Aug 16, 2020 | 2:02 PM

COVID-19 Strain 73 Variants: కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. తాజాగా ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా వైరస్ 73 రకాలుగా రూపాంతరం చెందుతుందని కనుగొన్నారు. సీఎస్ఐఆర్, ఐజీఐబీతో పాటు న్యూఢిల్లీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్‌కు చెందిన ఎస్యూఎం ఆసుపత్రి పరిశోధకులు కలిసి సుమారు 1,536 శాంపిల్స్ టెస్ట్ చేసి కరోనా జాతిలో బీ 1.112, బీ 1.99 అనే రెండు వంశాలు ఉన్నట్లు గుర్తించారు.

”కరోనా వైరస్ మహమ్మారి బలహీనతల గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే.. బాధితులకు చికిత్స చేయడమే కాకుండా దానికి విరుగుడు కనుక్కోవడం కూడా ఈజీ అవుతుందని పరిశోధన లీడ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జయశంకర్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా తమ పరీశోధనకు సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్‌లో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా మహమ్మారి చైనాలో మొదలై గత 8 నెలలుగా యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోగా.. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్