కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు

ఉభ‌య రాష్ట్రాల‌కు అల్ప పీడ‌నాల టెన్ష‌న్ ఎక్క‌వ‌వుతోంది. ఇప్ప‌టికే వ‌రుస‌ అప్ప‌పీడ‌నాల ప్ర‌భావంతో, భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు పోటెత్తిన విష‌యం తెలిసిందే.

  • Ram Naramaneni
  • Publish Date - 8:01 am, Sun, 30 August 20
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు

ఉభ‌య రాష్ట్రాల‌కు అల్ప పీడ‌నాల టెన్ష‌న్ ఎక్క‌వ‌వుతోంది. ఇప్ప‌టికే వ‌రుస‌ అల్ప ‌పీడ‌నాల ప్ర‌భావంతో, భారీ వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు పోటెత్తిన విష‌యం తెలిసిందే. తాజాగా ఉత్తర మ‌ధ్య‌ప్ర‌దేశ్ మ‌ధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌నం కొన‌సాగుతోంది. దీనికి తోడు అనుబంధంగా 7.6 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవర్త‌నం కొన‌సాగుతోంది. ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ఏరియా వరకు 0.9 కిలోమీట‌ర్ల‌ ఎత్తు వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఏపీలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాత‌వ‌ర‌ణ కేంద్రం శనివారం రాత్రి ప్రకటించింది.

దక్షిణ కోసాంధ్రా, ఉత్తర కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప‌లు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్న‌ట్లు తెలిపింది.

Also Read :

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”