Raviteja: జనం వస్తారనుకున్నాం కానీ… మరీ ఇంతలా వస్తారనుకోలేదు.. మంచి కిక్ ఇచ్చారు.. క్రాక్ విజయంపై..
Raviteja In Krack Sucess Meet: మాస్ మహారాజాకు కచ్చితంగా విజయం అవసరమైన సందర్భంలో వచ్చిన చిత్రమే 'క్రాక్'. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై...

Raviteja In Krack Sucess Meet: మాస్ మహారాజాకు కచ్చితంగా విజయం అవసరమైన సందర్భంలో వచ్చిన చిత్రమే ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతోంది. లాక్‌డౌన్ తర్వాత విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా క్రాక్ రికార్డు సృష్టించింది. ఇక రవితేజ నటన, తమన్ మ్యూజిక్, గోపిచంద్ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోన్న క్రాక్ విజయోత్సవ సభను బుధవారం చిత్రయూనిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో రవితేజ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞత తెలిపాడు. ఈ సందర్భంగా మాస్ మహారాజా మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత సినిమా చూడడానికి ప్రేక్షకులు కచ్చితంగా వస్తారని అనుకున్నాం. కానీ మరీ ఈ స్థాయిలో వస్తారని అస్సలు అనుకోలేదు. మంచి కిక్ ఇచ్చారు. గతంలో వచ్చినట్లే ఇప్పుడూ థియేటర్లకు వస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మంచి సంగీతాన్ని అందించాడు. ఇక కెమెరామెన్ విష్ణు అద్భుతంగా పనిచేశాడు. విష్ణుతో మళ్లీ పనిచేయాలని ఉంది. సాధారణంగా వరలక్ష్మీ ఎక్కువగా సీరియస్ పాత్రల్లో నటిస్తుంది కానీ.. సెట్‌లో మాత్రం అందరినీ ఎంతో నవ్విస్తుంది’ అని చెప్పుకొచ్చాడు రవితేజ.